శుక్రవారం 27 నవంబర్ 2020
Gadwal - Nov 05, 2020 , 05:41:23

వృత్తివిద్య నేటి విద్యార్థులకు అవసరం

వృత్తివిద్య నేటి విద్యార్థులకు అవసరం

  • ఉస్మానియా యూనివర్సిటీప్రొఫెసర్‌ పద్మజ
  • మానస వృత్తివిద్య కళాశాల  విద్యార్థులకు  వెబ్‌నార్‌లో అవగాహన

కొత్తకోట రూరల్‌: జాతీయ విద్యావిధానం ప్రకారం చదువుతోపాటు వృత్తి విద్య నేటి విద్యార్థులకు ఎంతో అవసరమని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పద్మజ అన్నారు. బుధవారం మండలంలోని అమడబాకుల స్టేజీ సమీపంలో ఉన్న మానస వృత్తివిద్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులకు ఆమె నూతన విద్యా విధానం, గాంధీజీ సూచించిన బేసిక్‌ విద్యా విధానంపై వెబ్‌నార్‌ నుంచి అవగాహన కల్పించారు. విద్యార్థి దశలోనే సంపూర్ణ ప్రయోజకులుగా ఎదిగేందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వృత్తి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకొని జీవితంలో ఉన్నతంగా రాణించాలన్నారు. వివిధ కోర్సుల్లోని పాఠ్యాంశాలను నిజజీవితంలోకి మలుచుకొని బోధించాలని అన్నారు. విద్యార్థులకు నిత్యజీవితంలో ఉపయోగపడేవిధంగా చదువుతోపాటు వృత్తివిద్య అమలైతేనే ప్రయోజనమని తెలిపారు. వెబ్‌నార్‌లో మానస వృత్తి విద్య కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అధ్యాపకులు ఖదీర్‌, భీమా ఇందిర, ప్రసాద్‌, రవిశంకర్‌, అంజు తదితరులు పాల్గొన్నారు.