అందరి సహకారంతోనే కరోనా కట్టడి

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల: నియోజకవర్గంలో అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు,పంచాయతీ, పురపాలక కార్మికుల సహకారంతోనే గద్వాల నియోజకవర్గంలో కరోనా కట్టడి చేయగలిగామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. కరోనా సమయంలో ప్రజలకు ధైర్యం చెబుతూ గ్రామాల్లో పర్యటిస్తూ కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఎమ్మెల్యే తెలియజేశారు. కరోనా బాధితులకు అండగా నిలిచినందుకు ఎమ్మెల్యేను విశ్వగ్రూప్ ప్రతినిధులు ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో శాలువాతో సత్కరించి అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కరోనా సమయంలో మనిషి ఇంకో మనిషి దగ్గరకు రావాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. అటువంటి సమయంలో నియోజకవర్గంలో అధికారులు,ప్రజాప్రతినిధుల సహకారంతో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పామన్నారు. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించడం వల్ల నియోజకవర్గంలో ఎక్కువ శాతం ప్రజలు కరోనా బారిన పడకుండా చేయగలిగామని చెప్పారు. కరోనా సమయంలో పురపాలక, పంచాయతీ కార్మికులతోపాటు ప్రజలు అందించిన సేవలు మరువ లేనివని తెలిపారు. వా రందరి సహకారం వల్లే ఈ గుర్తింపు వచ్చిందని, సేవలకు గుర్తింపుగా విశ్వగ్రూపు వారు అవార్డు అందజేయడంపై తన కు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. కరోనాకు ప్రజ లు భయపడాల్సిన అవసరం లేదని తగిన జాగ్రత్తలు పాటిస్తే ఇబ్బంది ఉండదన్నారు.
కార్యక్రమంలో విశ్వగ్రూపు ప్రతినిధులు రాంబాబు, పురపాలక చైర్మన్ బీఎస్ కేశవ్, జిల్లా రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్రాములు, ఎంపీపీ విజయ్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్, సర్పంచ్ ఆంజనేయిలు, నాయకులు శ్రీరాములు, రాము, వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
రైతు బీమా చెక్కు అందజేత
కేటీదొడ్డి మండలంలోని ఇర్కిచేడ్ గ్రామానికి చెందిన నాగప్ప అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుమారుడు వరుణ్‌కు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 5లక్షల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన సహాయాన్ని కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు చేయూత నివ్వడానికి రైతు బీమా, రైతుబంధు పథకాలు, ఉచిత విద్యుత్ ఇచ్చి ఆదుకుంటున్నారని చెప్పారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ఆపద సమయంలో ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ జిందప్ప, టీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్
- డేటా చోరీ గిఫ్ట్‌ల పేర బురిడీ..!
- షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు
- ఓటీపీ చెప్పండి.. కార్డు గడువు పొడిగిస్తాం..!
- రెండు రోజుల్లో.. రూ. 5లక్షలకు 4.5 కోట్లు లాభం
- రుణాల పేరుతో.. బురిడీ..
- పెండ్లి పేరుతో వల.. రూ. 10.69లక్షలు టోకరా
- బండి ఆపు.. పైసలివ్వు..!
- బండిస్తే జైలుకే..
- నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య