బుధవారం 03 మార్చి 2021
Gadwal - Nov 01, 2020 , 03:14:43

ఉక్కు మనిషి వల్లభాయ్‌ పటేల్‌

ఉక్కు మనిషి వల్లభాయ్‌ పటేల్‌

  • ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ 

గద్వాల క్రైం: దేశంలోని సంస్థానాలను సమైక్యం చేయడానికి కృషి చేసిన ఉక్కు మనిషి సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ అని ఎస్పీ రంజన్త్రన్‌కుమార్‌ అన్నారు. పటేల్‌ జయంతి సందర్భంగా శనివారం జిల్లా సాయుధ బలగాల కార్యాలయంలో ఏక్తాదివస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో త్యాగం చేసిన మహనీయులను గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. అనంతరం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన ధరూర్‌ ఎస్సై రాము, మానపాడు ఎస్సై గురుస్వామి, పట్టణ ఎస్సై రమాదేవి, సిబ్బంది నాగమణి, మల్లికార్జున్‌లతో పాటు చింతలకుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎస్‌పీసీ శ్రీజ, రాణి, రజితలకు ఎస్పీ జ్ఞాపికలను అందజేశారు. అనంతరం ఏక్తాదివస్‌ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కృష్ణ, సాయుధ దళ డీఎస్పీ యాదగిరి, ఏవో సతీశ్‌, డాక్టర్లు ఇర్షాద్‌, చుక్క పరశురాం, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ రాజేందర్‌రెడ్డి, సీఐ హన్మంతు, ఆర్‌ఐ నాగేశ్‌, ఆరోగ్యసిబ్బంది  పాల్గొన్నారు. 

పట్టుదల ఉండాలి..

గద్వాలటౌన్‌: చేసే ప్రతి పనిలో ఏకాగ్రత, పట్టుదల, నిబద్ధత ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని ఎస్పీ రంజన్త్రన్‌కుమార్‌ అన్నారు. ఇంటర్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఇంటర్‌ విద్యార్థులకు ఇస్తున్న ఉచిత పోలీస్‌ శిక్షణ ప్రారంభ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాలలో శనివారం ఏర్పాటు చేశారు. 

కార్యక్రమానికి ఆయనతో పాటు అడిషనల్‌ ఎస్పీ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రమం తప్పకుండ శిక్షణకు హాజరై శిక్షకులు ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇంటర్‌ నోడల్‌ అధికారి హృదయరాజు, ప్రిన్సిపాళ్లు శ్రీపతినాయుడు, వీరన్న, దేవేందర్‌రెడ్డి, రమేశ్‌లింగం, పీడీ ఆనంద్‌, పీఈటీలు సతీష్‌, శ్రీనివాసులు, నరసింహ, అధ్యాపకులు మంజుల, ఖలీముల్లా  పాల్గొన్నారు. 


VIDEOS

logo