శనివారం 23 జనవరి 2021
Gadwal - Oct 29, 2020 , 03:15:04

పర్యావరణ పరిరక్షణకే పల్లె ప్రకృతి వనాలు

పర్యావరణ పరిరక్షణకే పల్లె ప్రకృతి వనాలు

  •  అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష

అయిజ : పల్లెలను మరింత ఆహ్లాదకరంగా మార్చడంతోపాటు పర్యావరణ సమతుల్యతను పెంపొందించాలనే లక్ష్యంతోనే ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష పేర్కొన్నారు. బుధవారం మండలంతోని మేడికొండ, పులికల్‌, ఎక్లాస్‌పూర్‌, దేవబండ, యాపదిన్నె తదితర గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల పెంపకానికి గుర్తించిన ప్రభుత్వ భూములను అదనపు కలెక్టర్‌ పరిశీలించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని సంకల్పించిందన్నారు. అందుకనుగుణంగా జిల్లాలోని 255 పంచాయతీలలో ప్రభుత్వ భూములు కలిగిన పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాల పెంపకం చేపట్టామన్నారు. ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించి వనాల పెంపకాన్ని వేగవంతం చేయాలని ఎంపీవోను ఆదేశించారు. ప్రభుత్వ భూములు వనాల పెంపకానికి అనుకూలంగా లేని పక్షంలో సమీప శివారులో ఉంటే గుర్తించి పంచాయతీలకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

రైతు వేదికలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, వైకుంఠ ధామాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పల్లె ప్రగతిలో చేపట్టిన సీసీ రహదారుల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సర్పంచులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో నర్సింహారెడ్డి, అదనపు డీఆర్డీవో నాగేంద్ర, ఏపీవో విద్యాధర్‌, సర్పంచులు పాల్గొన్నారు. logo