మంగళవారం 01 డిసెంబర్ 2020
Gadwal - Oct 27, 2020 , 04:37:20

జూరాల సిగలో మరో మణిహారం

జూరాల సిగలో మరో మణిహారం

  • 55 ఎకరాల్లో గార్డెన్‌ ఏర్పాటు
  • రూ.15 కోట్ల నిధులు విడుదల
  • అత్యాధునిక హంగులతో నిర్మాణం
  • పర్యాటకులనుఆకర్షించేలా కట్టడాలు
  • నమూనా చిత్రం సిద్ధం   
  • త్వరలోనే శంకుస్థాపన

జూరాల సిగలో మరో మణిహారం ఏర్పాటు కానున్నది.. గద్వాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బృందావనం కల త్వరలోనే నెరవేరనున్నది.. ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్నారు.. జూరాల ప్రాజెక్ట్‌ వద్ద బృందావనం గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది.. రూ.15 కోట్లను విడుదల చేసింది.. ప్రాజెక్ట్‌ పరిసర ప్రాంతంలోని 55 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో గార్డెన్‌ నిర్మాణం చేపట్టనున్నది.. డీపీఆర్‌ పూర్తి అయ్యి గార్డెన్‌ నమూనా చిత్రాలను ఇప్పటికే సిద్ధం చేశారు.. ప్రభుత్వ ప్రకటనతో పర్యాటకుల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నది..

- జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ

రాష్ట్రంలో కృష్ణానదిపై మొదటగా ఏర్పాటు చేసిన జూరాల ప్రాజెక్టు వద్దకు పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మ రింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. పర్యాటకులను ఆకర్షించేలా ప్రాజెక్ట్‌ వ ద్ద అత్యాధునిక హంగులతో బృందావ న గార్డెన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. నిధులను కూడా విడుదల చేసింది. గార్డెన్‌ నిర్మాణంతో జూరాల మరిం త శోభ సంతరించుకోనున్నది. 

రూ.15 కోట్లు విడుదల..

బృందావన గార్డెన్‌ను ఏర్పాటు చేయాలని గద్వాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. అయినా సమైక్య నాయకులు పట్టించుకోకపోవడంతో గార్డెన్‌ పనులు మందుకు సాగలేదు. గద్వాలలో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా కొలువుదీరడంతో గద్వాల వాసుల కల త్వరలో నెరవేరనున్నది. గార్డెన్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.15 కోట్లు విడుదల చేసింది. త్వరలోనే పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. డీపీఆర్‌ పూర్తి అయ్యి గార్డెన్‌ నమూనా చిత్రాలు ఇప్పటికే సిద్ధం చేశారు. 

అత్యాధునిక హంగులతో ఏర్పాటు..

బృందావన గార్డెన్‌ను ప్రభుత్వం అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేయనున్నది. జూరాల ప్రా జెక్ట్‌ పరిసర ప్రాంతంలోని 55 ఎకరాల స్థలంలో గార్డెన్‌ నిర్మించనున్నారు. గార్డెన్‌లో ప్రవేశ ద్వారం నుంచి బయటకు వెళ్లే దారి వరకు అన్ని రకాల హంగులను కల్పించనున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా రెస్టారెంట్లు, ఆకలి తీర్చేందుకు ఫుడ్‌ కోర్టులు, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడేలా గార్డెనింగ్‌, జాయ్‌ ట్రైన్‌, స్విమింగ్‌ ఫూల్‌, జిప్‌ లై న్లు, పిల్లలు ఆడుకునేందుకు వివిధ రకాల ఆట పరికరాలు, వాటర్‌ థీమ్‌ పార్క్‌, రాక్‌ ైక్లెంబింగ్‌ ఏ రియా, సినిమా షూటింగ్‌లు తీసేలా ఆకర్షణీయమైన కట్టడాలు, కాటేజెస్‌, ఆంఫీ థియేటర్‌, పా ర్కింగ్‌ ఏరియా, ఇంటర్నేషనల్‌ పాథ్‌వే, రోలర్‌ కా స్టర్‌ రైడ్‌, మ్యూజికల్‌ ఫౌంటేన్‌, ఓపెన్‌ జిమ్‌, చైన్‌ లింక్‌ మెష్‌, గ్యాబేజెస్‌, ల్యాండ్‌ స్కేప్‌ ఏరియా, వాచ్‌ టవర్‌లను ఏర్పాటు చేయనున్నారు.