గురువారం 26 నవంబర్ 2020
Gadwal - Oct 27, 2020 , 04:37:20

34 మీటర్లు నీటి తోడివేత

34 మీటర్లు నీటి తోడివేత

కొల్లాపూర్‌: నీటిలో మునకకుగురైన ఎంజీకేఎల్‌ఐ పంప్‌హౌస్‌లో నుంచి భారీ మోటర్లతో నీటి తోడివేత పనులు యుద్ధప్రాతిపదికన కొసాగుతున్నాయి. ఈనెల 16న మునకకుగురైన పంప్‌హౌస్‌  సోమవారం 10వ రోజుకు 34 మీటర్లు నీటిని తోడివేశారు. ఈ పంప్‌హౌస్‌ మొత్తం 58 మీటర్లలోతు ఉండగా ఇందులో 51 మీటర్ల వరకు నీరు చేరి మోటర్లు మునకకుగురయ్యాయి. ఇప్పటి వరకు 34 మీటర్లు నీటిని తోడివేయగా మరో 17 మీటర్లు నీటిని తోడివేయాల్సి ఉందని ఇంజినీరింగ్‌ అధికారులు చెప్పారు. అయితే పంప్‌హౌస్‌ అడుగు భాగంలో అమర్చిన ఐదు మోటార్ల పైభాగం విడిభాగాలు నీటిలో కనిపిస్తున్నాయి.