శుక్రవారం 04 డిసెంబర్ 2020
Gadwal - Oct 27, 2020 , 04:37:20

జూరాలలో గేట్లు మూసివేత

జూరాలలో గేట్లు మూసివేత

  • ఇన్‌ఫ్లో 65,000 అవుట్‌ఫ్లో 39,035క్యూసెక్కులు

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ: జూరాలకు వరద తగ్గడంతో గేట్లను పూర్తిగా మూసివేశారు.  జూరాల  ప్రాజెక్ట్‌లో  ఇన్‌ఫ్లో 65,000 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో  39,035 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులుండగా ప్రస్తుతం 1043.966అడుగులతో పూర్తి స్థాయిలో నీరు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా 9.029టీఎంసీలుగా  నీరు చేరుకుంది. పవర్‌ హౌస్‌కు 37,029 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 21,779 క్యూసెక్కులుండగా అవుట్‌ ఫ్లో 21,779 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1705.00 అడుగులుండగా ప్రస్తుతం1704.72 అడుగులకు నీరు చేరుకున్నాయి. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలుంగా ప్రస్తుతం 128.19 టీఎంసీలకు నీరుచేరుకుంది. నారాయణపూర్‌ ఇన్‌ఫ్లో 25,651 క్యూసెక్కులుంగా అవుట్‌ ఫ్లో 24,407 క్యూసెక్కులకు చేరుకున్నది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగులుండగా ప్రస్తుతం 1614.99 అడుగులకు నీరు చేరుకున్నది. 

తుంగభద్రకు స్థిరంగా వరద

అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న మోస్తరు వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద స్థిరంగా చేరుతున్నది. టీబీ డ్యాంకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో 3గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం టీబీ డ్యాంకు 24,924 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదుకాగా, అవుట్‌ఫ్లో 24,564 క్యూసెక్కులు ఉంది. కర్ణాటక, ఏపీ రాష్ర్టాల పరిధిలోని ఎల్‌ఎల్సీ, హెచ్‌ఎల్సీ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీల నీటినిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికిగానూ 1633.00 నీటి మట్టం నిల్వ ఉంచుతున్నట్లు తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ వెంకట రమణ తెలిపారు. 

ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద ..

ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద నీరు కొనసాగుతున్నది. ఎగువన మోస్తరులో కురుస్తున్న వానలకు వాగులు, వంకలతో పాటు టీబీ డ్యాం ద్వారా ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద చేరుతోంది. సోమవారం ఆనకట్టకు 22,484 క్యూసెక్కులు ఇన్‌ ఫ్లో ఉండగా, 22 వేల క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోంది. ఆర్డీఎస్‌ ఆయకట్టుకు 484 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్‌ ఈఈ రామయ్య తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్‌ ఆనకట్టలో 9.8 అడుగుల మేరకు నీటిమట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 


తాజావార్తలు