బుధవారం 03 మార్చి 2021
Gadwal - Oct 24, 2020 , 01:12:17

సలహాలు సూచనలు ఇవ్వాలి

సలహాలు సూచనలు ఇవ్వాలి

  • కలెక్టర్‌ శృతిఓఝా

గద్వాల :  జిల్లాలో ప్రస్తుతం ఉన్న 592 పోలింగ్‌ స్టేషన్లకు అదనంగా ఎక్కడైనా కొత్తగా పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు లేదా ఓటర్ల పేర్లలో మార్పులు, చేర్పులు తొలగించాల్సిన ఓటర్లపై సలహాలు సూచనలు ఇవ్వాలని కలెక్టర్‌ శృతిఓఝా జిల్లాలోని ప్రజాప్రతినిధులను కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమ్మర్‌ రివిజన్‌ పై అన్ని పార్టీల రాజకీయ ప్రతినిధులతో సమావేశమై సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వివరిస్తూ ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రకారం పోలింగ్‌ స్టేషన్ల రేషలైజేషన్‌ కోసం అక్టోబర్‌ 31వరకు అవకాశం ఉందన్నారు. అందుకు స్పందించిన ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఉన్న అన్ని పోలింగ్‌ స్టేషన్లు నిబంధనల ప్రకారం రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయని ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌లో 15వందల ఓటర్లకు మించకుండా ఉన్నందున ప్రస్తుతానికి రైషలైజేషన్‌లో సమస్య లేదని కలెక్టర్‌కు వివరించారు.

అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ 1 జనవరి 2021 నాటికి 18ఏండ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఓటరు తమ పేరును ఓటర్‌ జాబితాలో నమోదు చేయించుకునేందుకు డిసెంబర్‌ 15వరకు చివరి అవకాశం కల్పించినట్లు చెప్పారు. కొత్తగా ఓటర్‌ జాబితాలో పేర్లు నమోదు చేయించుకోడవంతోపాటుగా పేర్లలో తప్పులు ఉన్నా, చిరునామాలు మార్పుల వంటివి చేయించుకోవచ్చని, మరణించిన వారి పేర్లను తొలగించేందుకు నిర్ణీత ప్రొఫార్మలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటరు తుది జాబితా 15జనవరి 2021ముంద్రించడం జరుగుతుందని ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఏవో భద్రప్ప టీఆర్‌ఎస్‌ నుంచి సుభాన్‌, కాంగ్రెస్‌ నుంచి పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మన్న, ఆర్‌పీఐ నుంచి అతికూర్హ్రేమాన్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo