మంగళవారం 01 డిసెంబర్ 2020
Gadwal - Oct 23, 2020 , 01:50:45

మాజీ హోం మంత్రి నాయినికి ఘననివాళి

మాజీ హోం మంత్రి నాయినికి ఘననివాళి

అలంపూర్‌ : తెలంగాణ రాష్ట్ర మొదటి హోం మంత్రి, ఉద్యమ కార్మిక నాయకుడు  నాయిని  నర్సింహారెడ్డి అకాల మరణం రాష్ర్టానికి తీరని లోటని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ అన్నారు. గురువారం అలంపూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో మాజీ హోం మంత్రి నాయిని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, కమిషనర్‌ బాలాజీ, కౌన్సిలర్లు సుదర్శన్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మద్దిలేటి, కృష్ణ మూర్తి, నాగరాజు, శీను, కనకం బాబు పాల్గొన్నారు.

సామాన్యులకు సైతం అందుబాటులో.. 

వడ్డేపల్లి : మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణవార్తను తాము జీర్ణించుకోలేక పోతున్నామని పైపాడుకు చెందిన కేశమ్మ, ఓబులేసులు గుర్తుచేసుకున్నారు. పైపాడు గ్రామానికి చెందిన వీరు శాంతినగర్‌ పోలీస్‌స్టేషన్‌లో తమకు న్యాయం జరగలేదని గతంలో హోం మినిస్టర్ట్‌ను కలిశారు. సామాన్యులైనప్పటికీ వారిని సమస్యను ఓపిగ్గా విని వెంటనే చర్యలు తీసుకున్నాడన్నారు.