సోమవారం 30 నవంబర్ 2020
Gadwal - Oct 22, 2020 , 02:55:01

కొనసాగుతున్న వరద

కొనసాగుతున్న వరద

  • జూరాలకు 3.45 లక్షల ఇన్‌ఫ్లో, 3.25 లక్షల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో  
  • 30 గేట్ల ద్వారా దిగువకు విడుదల
  • టీబీ డ్యాంకు 40 వేల ఇన్‌ఫ్లో, 40 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో  
  •  పది గేట్ల ద్వారా నీటి విడుదల
  • శ్రీశైలంలో నాలుగు లక్షల క్యూసెక్కుల  ఇన్‌ఫ్లో 
  • పది గేట్ల ద్వారా సాగర్‌కు పయనం..

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ : జూరాలకు వరద కొనసాగుతున్నది. బుధవారం ఇన్‌ఫ్లో 3,45,000, అవుట్‌ఫ్లో 3,25,863 క్యూసెక్కులు గా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు, నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1043.143 అడుగుల్లో 4.805 టీఎంసీ లు ఉన్నది. వరద ప్రవాహం అధికంగా ఉండటం తో ప్రాజెక్ట్‌లో విద్యుదుత్పత్తిని పూర్తిగా నిలిపివేశా రు. 30 గేట్లను ఎత్తి నదిలోకి 3,06,300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ, సమాంతర కాలువలతోపాటు ఎత్తిపోతల పథకాలను నీటి పంపింగ్‌ కొనసాగుతున్నది. ఆల్మ ట్టి ఇన్‌ఫ్లో 51,117, అవుట్‌ఫ్లో 44,196 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1705 అడుగులు, నిల్వ 129.72 టీఎంసీలు కా గా, ప్రస్తుతం 1704.72 అడుగుల్లో 128.19 టీ ఎంసీలు నిల్వ ఉన్నది. నారాయణపూర్‌ ప్రాజెక్టు ఇ న్‌ఫ్లో 54,192, అవుట్‌ఫ్లో 56,181 క్యూసెక్కులు గా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1615 అడుగులు, నిల్వ 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1614.34 అడుగుల్లో 37.12 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 

టీబీ డ్యాంకు..

అయిజ : కర్ణాటకలోని ఎగువన కురుస్తున్న వర్షా లతో తుంగభద్ర జలాశయానికి వరద పెరుగుతోంది. బుధవారం టీబీ డ్యాంకు ఎగువ నుంచి వరద పెరుగుతుండటంతో 10 గేట్లు రెండు అడుగు ల మేర ఎత్తి దిగువకు 35,154 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 40,154, అవుట్‌ఫ్లో 40,154 క్యూసెక్కులు నమోదైంది. కర్ణాటక, ఏపీ రాష్ర్టాల పరిధిలోని ఎల్‌ఎల్సీ, హెచ్‌ఎల్సీ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1633 అడుగులు, నిల్వ 100.855 టీఎంసీలు కాగా, పూర్తి స్థాయిలో నీటిని నిల్వ ఉంచినట్లు ఎస్‌ఈ వెంకటరమణ తెలిపారు. 

ఆర్డీఎస్‌ ఆనకట్టకు..

ఎగువన కురుస్తున్న మోస్తరు వర్షాలతో ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద చేరుతున్నది. ఆనకట్టకు 50,824 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 50,400 క్యూసెక్కు లు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యా రేజీకి చేరుతున్నది. ఆయకట్టుకు 424 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ఈఈ రామయ్య తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 11.1 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.           

సుంకేసులకు..

రాజోళి : సుంకేసుల బ్యారేజీకి వరద కొనసాగుతున్నది. ఇన్‌ఫ్లో 50 వేల క్యూసెక్కులు ఉండగా, 11 గేట్ల ద్వారా దిగువకు 47,500 క్యూసెక్కుల నీ టిని విడుదల చేశారు. కేసీ కెనాల్‌కు 2,500 క్యూసెక్కులు వదిలినట్ల్ల్లు జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

శ్రీశైలానికి..

శ్రీశైలం : వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. బుధవారం రాత్రికి నాలుగు లక్షలకు పైగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండటంతో పది గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి 3,24,828, సుంకేసుల నుంచి 50,904, హంద్రి నుంచి 117 క్యూసెక్కులు (మొత్తం 3,92,924) శ్రీశైలానికి విడుదల చేశారు. రాత్రి తొమ్మిది గంటలకు 4,18,658 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. డ్యాం పది గేట్లను పదిహేను అడుగుల మేర తెరిచి 3,76,670, కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 26,982  క్యూసెక్కులు (మొత్తం 4,03,652) దిగువన ఉన్న సాగర్‌ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటిమ ట్టం 885 అడుగులు, నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 884.40 అడుగుల్లో 211. 9572 టీఎంసీలు నిల్వ ఉన్నది. కుడిగట్టు జలవిద్యుదుత్పత్తి ద్వారా 27,048 క్యూసెక్కులు వినియోగించి 13.196 మిలియన్‌ యూనిట్ల వి ద్యుదుత్పత్తి చేసినట్లు సీఈ నర్సింహారావు చెప్పారు.