శుక్రవారం 05 మార్చి 2021
Gadwal - Oct 21, 2020 , 03:20:17

చారిత్రక ప్రదేశాలను సుందరంగా తీర్చిదిద్దుతాం

చారిత్రక ప్రదేశాలను సుందరంగా తీర్చిదిద్దుతాం

గద్వాల : భవిష్యత్‌లో గద్వాల పట్టణంలోని పలు చారిత్రక ప్రదేశాలను సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మున్సిపల్‌  అధికారులు, మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌తో  కలిసి ఎమ్మెల్యే జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో ఉండే పురాతన బావితో పాటు సంగాల చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రజలతోపాటు పట్టణానికి ఇతర ప్రాం తాల నుంచి వచ్చే వారి కోసం ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యంగా జిల్లా కేంద్రంలో వాటర్‌ ఫౌంటేన్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు  ఎమ్మెల్యే చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు సేదతీరుదామంటే పార్కులు ఉండేవి కావని దీంతోపాటు చూడ దగ్గ ప్రదేశాల వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఆహ్లాదం పొందడానికి ఎటువంటి అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రజలకు కనువిందు చేయడానికి  మున్సిపాలిటీలో ఉన్న పురాతన బావితోపాటు సంగాల చెరువు దగ్గర వాటర్‌ఫౌంటేన్‌ ఏర్పాటు కోసం స్థలాలు పరిశీలన చేసినట్లు తెలిపారు. సెలవుల సమయంలో కుటుంబసభ్యులు తమ చిన్నారులతో ఇక్కడికి వచ్చి కాలక్షేపం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్‌ కమిషనర్‌ నర్సింహ, వైస్‌చైర్మన్‌ బాబర్‌, కౌన్సిలర్లు నరహరి, శ్రీనివాసులు, నాగరాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు గోవిందు, ఎల్‌అండ్‌టీ శ్రీనివాస్‌రెడ్డి, నాగులుయాదవ్‌, రాజు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఆన్‌లైన్‌ పత్రాలు ఎమ్మెల్యేకు అందజేత..

 జిల్లా కేంద్రంలోని 16వవార్డు, మేల్లచెర్వు తదితర ప్రాంతాలకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్సీ ఓటర్‌ నమోదుకు సంబంధించి ఆన్‌లైన్‌ నమోదు చేసుకోగా వాటిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు టీఆర్‌ఎస్‌ నాయకులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, వైస్‌ చైర్మన్‌ బాబర్‌, ఎంపీపీ విజయ్‌కుమార్‌, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ సుభాన్‌, జెడ్పీటీసీ రాజశేఖర్‌ నేతలు వైండింగ్‌ రాములు, సీసల వెంకటరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భీంరెడ్డి, రంగన్న పాల్గొన్నారు.


VIDEOS

logo