గురువారం 25 ఫిబ్రవరి 2021
Gadwal - Oct 19, 2020 , 04:24:26

తగ్గని జోరు అదే హోరు

తగ్గని జోరు అదే హోరు

  • ఎగువ నుంచి కొనసాగుతున్న వరద ఉధృతి
  • జూరాలలో 40గేట్లు..శ్రీశైలంలో 10 గేట్లు ఎత్తివేత
  • ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులకు భారీగా ఇన్‌ఫ్లో

 జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ: జూరాలకు స్థిరంగా వరదన కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌లో 40గేట్లను ఎత్తి నదిలోకి  4,13,920 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్‌లో ఇన్‌ఫ్లో 4,15,000 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 4,15,625 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులుండగా ప్రస్తుతం 1034.449అడుగులతో పూర్తి స్థాయిలో నీరు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా 4.225టీఎంసీలుగా నీరు చేరుకుంది. ఆల్మట్టి ఇన్‌ఫ్లో 1,66,871 క్యూసెక్కులుండగా అవుట్‌ ఫ్లో 1,49,279 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1705.00 అడుగులుండగా ప్రస్తుతం1704.04 అడుగులకు నీరు చేరుకున్నాయి. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలుగా ప్రస్తుతం 124.38 టీఎంసీలకు నీరుచేరుకుంది. నారాయాణపుర ఇన్‌ఫ్లో 1,71,336 క్యూసెక్కులుగా అవుట్‌ ఫ్లో 1,63,311 క్యూసెక్కులకు చేరుకుంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగులుండగా ప్రస్తుతం 1612.63 అడుగులకు నీరు చేరుకుంది. 

టీబీ డ్యాం పది గేట్లు ఎత్తివేత

అయిజ : టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 38,112 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదుకాగా, అవుట్‌ఫ్లో 35,911 క్యూసెక్కులు ఉంది. ఎగువ నుంచి వరద పెరుగుతుండటంతో పది గేట్లు అడుగు మేర ఎత్తి 35,911 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 

ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద ..

ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద నీరు కొనసాగుతున్నది. ఆదివారం ఆనకట్టకు 48,370 క్యూసెక్కులు ఇన్‌ ఫ్లో ఉండగా, 48 వేల క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోంది. ఆర్డీఎస్‌ ఆయకట్టుకు 370 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్‌ ఈఈ రామయ్య తెలిపారు. 


VIDEOS

logo