యువతకు ఉపాధి ఫుల్

- జోగుళాంబ గద్వాల జిల్లాలో 251 మందికి ట్రాక్టర్ల పంపిణీ
గద్వాల న్యూటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. 50 శాతం సబ్సిడీపై రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేసింది. 2016-17, 2017-18 సంవత్సరాల్లో నార్మల్ స్టేట్ ప్లాన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద జోగుళాంబ గద్వాల జిల్లాలో 251 మంది లబ్ధి పొందారు. ట్రాక్టర్ విలువ రూ.7 లక్షలు కాగా.., రైతులు కేవలం రూ.3.50 లక్షలు మాత్రమే చెల్లించారు. కొందరు రైతులు సబ్సిడీ మొత్తాన్ని చెల్లించి తీసుకోగా.. మరికొందరు నెల కంతులు చెల్లించేలా బ్యాంకర్లతో ఒప్పందం చేసుకున్నారు. నేడు సబ్సిడీ ట్రాక్టర్లతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. సాగు అవసరాలకే కాకుండా ధాన్యం, రవాణా ఇతర పనులకు వినియోగించుకుంటున్నారు. రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేయడంతో పల్లెల్లో యువతకు ఉపాధి పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తులను రైతులు నేరుగా ట్రాక్టర్ల ద్వారా మార్కెట్కు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. కాగా, జిల్లాలో జలవనరులు పుష్కలంగా ఉండడంతో ట్రాక్టర్ల వినియోగం బాగా పెరిగింది.
జిల్లాలో 251 ట్రాక్టర్ల పంపిణీ..
జోగుళాంబ గద్వాల జిల్లాలో 251 ట్రాక్టర్లను రైతులకు పంపిణీ చేశారు. అలంపూర్ మండలంలో 11, ధరూర్లో 21, గద్వాలలో 25, గట్టులో 23, అయిజలో 27, ఇటిక్యాలలో 25, కేటీదొడ్డిలో 21, మల్దకల్లో 35, మానవపాడులో 27, రాజోళిలో 8, ఉండవల్లిలో 15, వడ్డేపల్లి మండలంలో 19 ట్రాక్టర్లను అందజేశారు.
ట్రాక్టర్లతో ఉపాధి పెరిగింది..
సబ్సిడీ కింద ట్రాక్టర్లను ఇవ్వడంతో పల్లెల్లో యువతకు ఉపాధి పెరిగింది. వ్యవసాయంలో ట్రాక్టర్లు వినియోగించడంతో యువతతోపాటు వ్యవసాయ కూలీలకు కూడా పనులు లభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు మంచి ఆదాయ వనరుగా మారాయి. మరోవైపు ట్రాక్టర్ల అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. ట్రాక్టర్లను అన్ని రకాలుగా వినియోగించుకుంటుండడంతో నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు.
- శ్రీరాములు, కుర్వపల్లి, గద్వాల
తాజావార్తలు
- విపణిలోకి బజాజ్ ఈవీ ప్లాటినా 100.. ధరెంతంటే?!
- చౌకధరకే టెస్లా విద్యుత్ కారు!
- ఆ టైంలో అందరూ భయపెట్టారు: అమలా పాల్
- ఖాదర్బాషా దర్గాను సందర్శించిన హోంమంత్రి
- హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
- యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
- ఆస్తి పన్ను పెంపు దారుణం : చంద్రబాబు
- స్మృతి మందాన@6
- ‘నాంది’ 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
- వామన్రావు దంపతుల హత్య బాధ కలిగించింది : కేటీఆర్