వరద హోరు.. కృష్ణమ్మ జోరు

- ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 50 గేట్లు ఎత్తివేత
- ఇన్‌ఫ్లో 5,05,000, అవుట్‌ఫ్లో 5,82,275 క్యూసెక్కులు
- శ్రీశైలం వద్ద మహోగ్రరూపం
- ఆల్మట్టి, నారాయణపూర్, టీబీ డ్యాంలకూ భారీగా వరద
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ : భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. గురువారం రాత్రి అధికారులు ప్రా జెక్ట్ 50 గేట్లను ఎత్తి దిగువకు 5,81,300 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 5,05,000, అవుట్‌ఫ్లో 5,82,275 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రా జెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు, ని ల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1041. 634 అడుగులు, 7.627 టీఎంసీలు నిల్వ ఉన్నా యి. ప్రాజెక్ట్ కుడి, ఎడమ, సమాంతర కాలువలకు నీటి పంపింగ్ కొనసాగుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 98,270, అవుట్‌ఫ్లో 1,11,279 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1705.00 అడుగులు, నిల్వ 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1704.53 అడుగులు, 127.10 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
నారాయణపూర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,40,244, అవుట్‌ఫ్లో 1,54,530 క్యూసెక్కులకు చేరింది. పూ ర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగులు, నిల్వ 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1612.76 అడుగులు, 34.56 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
టీబీ డ్యాంకు..
అయిజ : కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో టీబీ డ్యాంకు ఇన్‌ఫ్ల్లో కొనసాగుతున్నది. డ్యాంకు 17,276 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 19,006 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. కర్ణాటక, ఏపీ రాష్ర్టాల పరిధిలోని ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడుగులు, నిల్వ 100.855 టీ ఎంసీలు కాగా, ప్రస్తుతం 1632.85 అడుగులు, 100.276 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు ఎస్ఈ వెంకట రమణ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
ఆర్డీఎస్ ఆనకట్టకు 34,633 క్యూసెక్కులు ఇ న్‌ఫ్లో నమోదు కాగా 34 వేల క్యూసెక్కులు ఆనకట్ట పై నుంచి దిగువకు పారుతున్నట్లు ఈఈ రామయ్య తెలిపారు. ఆయకట్టుకు 352 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. ప్రస్తుతం ఆనకట్టలో 10.4 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు.
శ్రీశైలం వద్ద మహోగ్రరూపం
శ్రీశైలం : మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చిం ది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 6,31,182 విడుదల చేయగా.. డ్యాంకు 5,20,832 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అయ్యింది.
దీంతో డ్యాం 10 గేట్లను 25 అడుగుల ఎత్తు తెరి చి అధికారులు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ది గువకు 5,61,510 క్యూసెక్కులు వెళ్తున్నాయి. కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 25,737 క్యూ సెక్కులు కలిపి మొత్తం 5,87,247 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమ ట్టం 885 అడుగులకుగానూ 883.50 అడుగులకు చేరగా.. సామర్థ్యం 215.807 టీఎంసీలు ఉండగా 207.4103 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
తాజావార్తలు
- టీఆర్ఎస్, బీజేపీ పాలనలోని వ్యత్యాసాలను వివరించండి
- రానా 'అరణ్య' ట్రైలర్ వచ్చేసింది
- అవినీతి ఆరోపణలు.. గుడిపల్లి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
- రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ వీడియో వైరల్
- ఎన్నికల తాయిలంగా కోడిపిల్లలు.. పట్టుకున్న అధికారులు
- బంగారం, షేర్లు, ఎఫ్డీలను మించి మగువల మనసు దోచింది అదే!
- భార్యను చంపేందుకు యత్నించిన భర్త
- 6 నెలలు.. 2 సినిమాలు.. తారక్ ఫ్యాన్స్‌కు పండగే..
- ‘భారత్ మాతా కీ జై’ అనే బీజేపీ నేతలే దేశభక్తులు కాదు: సీఎం ఉద్ధవ్
- మాక్స్వెల్ భారీ సిక్సర్‌కు పగిలిన సీటు..విరిగిన కుర్చీ వేలానికి!