గురువారం 04 మార్చి 2021
Gadwal - Oct 03, 2020 , 00:53:03

రేషన్‌ బియ్యం పట్టివేత

రేషన్‌ బియ్యం పట్టివేత

గద్వాల క్రైం: ప్రభుత్వం పేదలకు అందించాల్సిన రేషన్‌ బియ్యాన్ని కొందరు దళారులు అక్రమార్జనే ధ్యేయంగా అమ్ముకుంటున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలోని  ఓ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని  శుక్రవారం పట్టుకున్నారు.  పట్టణ ఎస్సై సత్యనారాయణ కథనం మేరకు వివరాలు.. అయిజ రోడ్డులోని ఓ మిల్లులో 250 బస్తాల బియ్యాన్ని నిల్వ ఉంచుకున్నారు. అయితే పక్కా సమచారంతో సీఐ హన్మంతు, పట్టణ ఎస్సై, ఆర్‌ఐలు  తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో మిల్లులో నిల్వ ఉంచుకున్న 250బస్తాల రేషన్‌ బియ్యం లభ్యమయ్యాయి. దీంతో  సదరు బియ్యాన్ని స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. రేషన్‌ షాపు ద్వారా పేదలకు అందించాల్సిన రేసన్‌ బియ్యాన్ని మిల్లులో నిల్వ ఉండటంపై అనేక అనుమాలకు దారి తీస్తుంది. పట్టుకున్న బియ్యం ఎఫ్‌సీఐ గోదాం నుంచి తీసుకొచ్చారా..? లేక రేషన్‌ షాపు నుంచి తీసుకొచ్చారా..? అనేది తెలియాల్సింది. 


VIDEOS

logo