ఆదివారం 01 నవంబర్ 2020
Gadwal - Oct 02, 2020 , 02:57:07

ఆడబిడ్డను అమ్మజూపి..

ఆడబిడ్డను అమ్మజూపి..

అయిజ: అభం శుభం తెలియని రెండేండ్ల చిన్నారిని ఓ తండ్రి అనధికారికంగా దత్తతకు అమ్మినట్లు సమాచారం రావడంతో ఐసీడీఎస్‌ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైన సంఘటన అయిజ పట్టణంలో చోటు చేసుకున్నది. ఎస్సై జగదీశ్వర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మల్దకల్‌ మండలం, మల్లెందొడ్డి గ్రామానికి చెందిన పాపన్న, దేవి దంపతులు మున్సిపాలిటీ పరిధిలోని కర్నూల్‌ రహదారిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా రెండేళ్ల చిన్నారిని గద్వాల మండలం, బీరెళ్లి గ్రామానికి చెందిన శ్రీరాములుకు రూ.30వేలకు విక్రయించినట్లు జిల్లా బాలల సంరక్షణ అధికారి కుసుమలత, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ముసాయిదా బేగం, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ యామినికి సమాచారం రావడంతో అయిజకు చేరుకుని తల్లిదండ్రుల వద్ద నుంచి రెండేళ్ల చిన్నారిని అదుపులోకి తీసుకున్నారని ఎస్సై తెలిపారు. సీడబ్ల్యూసీ చైర్మన్‌ ఆదేశాల మేరకు చిన్నారిని మహబూబ్‌నగర్‌లోని శిశు గృహకు తరలించడం జరిగిందన్నారు.తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చిన్నారిని శిశు గృహలో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.