ఆదివారం 01 నవంబర్ 2020
Gadwal - Oct 02, 2020 , 02:57:07

లక్ష్యాలను గ్రౌండింగ్‌ చేయాలి

లక్ష్యాలను గ్రౌండింగ్‌ చేయాలి

  • కలెక్టర్‌ శృతిఓఝా

గద్వాల: వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా సబ్సిడీపై లబ్ధిదారులకు అం దించే విషయంలో గత జిల్లాస్థాయిల బ్యాం కర్ల సమీక్ష సమావేశం లో నిర్ధేశించిన లక్ష్యాలను వెంటనే గ్రౌండింగ్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శృతిఓఝా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ చాంబర్‌లో లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌, వ్యవసాయరంగ అనుబంధ శాఖలు, డీఆర్‌డీవోతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో వివిధ శాఖల ద్వారా పెండింగ్‌లో ఉన్న సబ్సిడీ రుణాలు ఎంతవరకు గ్రౌండింగ్‌ అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. మత్స్యశాఖ ద్వారా వారికి అందించాల్సిన సబ్సిడీ రుణాలు ఇంతవరకు ఎందుకు గ్రౌండింగ్‌ కాకపోవడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించారు. 3500 దరఖాస్తులు రావడం వల్ల ఇందులో అర్హులు ఎవరో గుర్తించలేక పోవడం వల్ల రుణాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. స్వయం సహాయక రుణాలపై మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో జిల్లా నుంచి ఈ ఏడాది ఇంకా రూ.53కోట్ల రుణాలు గ్రౌండింగ్‌ కావాల్సి ఉందని ఎందుకు గ్రౌండింగ్‌ కాలేదని ఎల్‌డీఎంను కలెక్టర్‌ ప్రశ్నించారు. ఆప్‌లైన్‌ ద్వారా అందరికీ రుణాలు అందించడం జరిగిందని వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉందని చెప్పారు.

పశుసంవర్థక, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పాడిపశువులకు సంబంధించిన రుణాలు ఇప్పటివరకు గ్రౌండింగ్‌ కాలేదని వెంటనే డ్యాక్కుమెంటేషన్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. విజయడెయిరీతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా సొసైటీ ఏర్పాటు చేసే విధంగా  చూడాలన్నారు. ప్రైవేట్‌ బ్యాంకులు కాన్సెంట్‌ ఇవ్వటంలో చాలా తాత్సారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఆర్‌డీవో ఉమాదేవి, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్‌, ఎల్‌డీఎం రవీందర్‌, మత్స్యశాఖ అధికారి రూపేందర్‌సింగ్‌, పశుసంవర్ధకశాఖ అధికారులు సురేశ్‌, వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రమేశ్‌బాబు, విజయడెయిరీ మేనేజర్‌ సురేశ్‌ పాల్గొన్నారు.