మంగళవారం 27 అక్టోబర్ 2020
Gadwal - Sep 27, 2020 , 06:46:16

రైతువేదికల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

రైతువేదికల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

  • కలెక్టర్‌ శృతి ఓఝా

గద్వాల : జిల్లాలో రైతు వేదికల నిర్మాణ పనులు అక్టోబర్‌ 10లోగా అన్ని పూర్తయ్యే విధంగా రోజువారీ కార్యాచరణ నిర్ధేశించుకుని దానికి అనుగుణంగా పనులు చేయించాలని కలెక్టర్‌ శృతిఓఝా పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశపు మందిరంలో రైతు వేదికల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నిర్ధేశించిన గడువులోపల నిర్మాణ పనులు పూర్తి కావడానికి ఏ రోజుకారోజు చేయాల్సిన పనుల కార్యాచరణను పంచాయతీరాజ్‌ ప్రధాన ఇంజినీర్‌ ద్వారా ఇది వర కే జారీ చేయడం జరిగిందని దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనులు ఎందుకు పూర్తి కావడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాచరణ ప్రకారం పనులు చేయించాలని, డీఈలు, ఏఈలు క్షేత్రస్థాయిలో ఉండి పనులు చేయించాలని ఆదేశించారు.

జిల్లాలో ఇప్పటి వరకు 9క్లస్టర్లలో ట్రస్‌ వేయడం పూర్తి అయిందని నాలుగు క్లస్టర్లలో పనులు చివరి దశలో ఉండగా ఒక చోట పనులు పూర్తి అయినట్లు పంచాయతీ రాజ్‌ ఈఈ సమత కలెక్టర్‌కు తెలిపారు. 40 క్లస్టర్లలో లెంటల్‌ లెవల్‌ వరకు ఉన్నాయని మరో తొమ్మిది క్లస్టర్లలో రూఫ్‌ లెవల్‌ పూర్తి కాగా వాటికి రెండు,మూడు రోజుల్లో ట్రస్‌ వేయడం పూర్తి అవుతుందని కలెక్టర్‌కు తెలియజేశారు.సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ శివకుమార్‌, ఈడీ రవీందర్‌, ఆర్‌అండ్‌బీ డీఈ కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


logo