బుధవారం 28 అక్టోబర్ 2020
Gadwal - Sep 27, 2020 , 06:44:23

కృష్ణా, తుంగభద్ర పరవళ్లు

కృష్ణా, తుంగభద్ర పరవళ్లు

  •  నిండుకుండలను తలపిస్తున్న ప్రాజెక్టులు 
  • జూరాల ప్రాజెక్టు 37 గేట్లు, శ్రీశైలం 10 గేట్లు ఎత్తివేత
  •  ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలకూ భారీగా వరద
  • తుంగభద్ర డ్యాం 20 గేట్ల ద్వారా దిగువకు నీరు
  • మళ్లీ తెరుచుకున్న సరళాసాగర్‌ సైఫన్లు

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ : జూరాలకు వరద భారీగా కొనసాగుతున్నది. ఇన్‌ఫ్లో 3,24,800 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 3,70,439 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌లో 37 గేట్లను ఎత్తి దిగువకు 3,24,800 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు కాగా 1044.094 అడుగులకు చేరింది. సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా 9.092 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పవర్‌హౌస్‌కు 20,930 క్యూసెక్కులు విడుదల చేస్తూ 5 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ, సమాంతర కాలువలతోపాటు ఎత్తిపోతల పథకాలను నీటి పంపింగ్‌ కొనసాగుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 80,000 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 82,000 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులకుగానూ 1703.02 అడుగులకు చేరింది. సామర్థ్యం 129.72 టీఎంసీలు ఉండగా 122.834 టీఎంసీలు నిల్వ ఉన్నా యి. నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 1,40,000, అవుట్‌ఫ్లో 1,39,400 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగానూ ప్రస్తు తం 1613.05అడుగులకు చేరింది. సామ ర్థ్యం 37.64 టీఎంసీలు ఉండగా 32.74 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 

తుంగభద్రకు వరద

అయిజ : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టు ఎగువనున్న తుంగ జలాశయం ద్వారా 9,755 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. ఇన్‌ఫ్లో 57,753 క్యూసెక్కులుగా నమోదు కాగా 10 గేట్లు రెండు అడుగులు, 10 గేట్లు అడుగు చొప్పున ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అవుట్‌ఫ్లో 58,153 క్యూసెక్కులుగా నమోదైంది. కర్ణాటక, ఏపీ పరిధిలోని ఎల్‌ఎల్సీ, హెచ్‌ఎల్సీ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతున్నది. 100.855 టీఎంసీల సామ ర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 1633 అడుగుల నీటిమట్టానికి అదే స్థాయిలో నిల్వ ఉంచినట్లు ఎస్‌ఈ వెంకటరమణ తెలిపారు. 

ఆర్డీఎస్‌ ఆనకట్టకు

కర్ణాటకలోని ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద కొ నసాగుతున్నది. టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్‌ ఆ నకట్టకు ప్రవాహం పెరిగింది. ఇన్‌ఫ్లో 66,252 క్యూసెక్కులు నమోదు కాగా 65,600 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి ప్రవహించిందని ఈఈ రామయ్య తెలిపారు. ఆ యకట్టుకు 652 క్యూసెక్కులు విడుదల చే స్తుండగా.. ప్రస్తుతం ఆనకట్టలో 12.7 అడుగులమేర నీటిమట్టం నమోదైనట్లు చెప్పారు. 

సుంకేసులకు 

70వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

రాజోళి : సుంకేసుల బ్యారేజీకి ఎగువ నుంచి వరద వచ్చి చేరుతున్నది. ఇన్‌ఫ్లో 70 వేల క్యూసెక్కులు నమోదు కాగా 14 గేట్లు తెరిచిన అధికారులు 69 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసినట్లు జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 

గంటగంటకూ ఉధృతంగా.. 

శ్రీశైలం : ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు గంటగంటకూ వరద భారీగా పెరుగుతున్నది. దీంతో జలాశయం నీటితో తొణికిసలాడుతున్నది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 4,39,566 క్యూసెక్కులు విడుదల చేయగా.. శనివారం 4,10,321 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో అధికారులు డ్యాం పది గేట్లను 15 అడుగుల ఎ త్తులో తెరిచి 3,76,670 క్యూసెక్కులు విడుదల చేశారు. కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 30,001 క్యూసెక్కులు మొత్తం 4,06,671 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. డ్యాం నీటిమట్టం 885 అడుగులు కాగా 884.40 అడుగులకు చేరగా.. సామ ర్థ్యం 215.807 టీఎంసీలు ఉండగా 212.4385 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. logo