మంగళవారం 27 అక్టోబర్ 2020
Gadwal - Sep 25, 2020 , 06:17:01

అనుకున్న సమయానికి పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్‌

అనుకున్న సమయానికి పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్‌

కేటీదొడ్డి : దసరా పండుగ కంటే ముందుగానే రైతువేదిక నిర్మాణాలు పూర్తి చేయాలని అదనపు  కలెక్టర్‌ శ్రీహర్ష సూచించారు. మండలంలోని చింతలకుంట, గువ్వలదిన్నె గ్రామాల్లో నిర్మిస్తున్న రైతువేదిక పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతువేదిక పనులు త్వరగా నాణ్యతతో చేపడితే రైతులకు, అధికారులకు మేలు జరుగుతుందన్నారు. గ్రామాల్లో జరుగుతున్న ఇతర అభివృద్ధి పనులు కూడా వేగంగా జరగాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయరాంనాయక్‌, ఏపీవో కుమార్‌, సర్పంచ్‌ మహాదేవి, నాయకులు వెంకటేష్‌గౌడ్‌, రమేశ్‌, వీరన్న తదితరులు పాల్గొన్నారు.


logo