శుక్రవారం 30 అక్టోబర్ 2020
Gadwal - Sep 25, 2020 , 06:17:01

రైతు వేదికల పనుల్లో వేగం పెంచాలి

రైతు వేదికల పనుల్లో వేగం పెంచాలి

  • కలెక్టర్‌ శృతి ఓఝా

రాజోళి: రైతు వేదికల నిర్మాణాల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ శృతి ఓఝా అన్నారు. మండలంలోని రాజోళి, పచ్చర్ల, మాన్‌దొడ్డి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణాల పనులను ఆమె పరిశీలించారు. చాలా చోట్ల బేస్‌మెంట్‌ లెవల్లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. అక్టోబర్‌ 10నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని, అవసరమైతే కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. పనుల్లో జాప్యం జరిగినా, నాణ్యత లోపించినా చర్యలు తప్పవని కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో ముసాయిదాబేగం, ఆర్‌అండ్‌బీ ఏఈ కిరణ్‌కుమార్‌, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.