బుధవారం 28 అక్టోబర్ 2020
Gadwal - Sep 24, 2020 , 03:00:05

ఇంటి నెంబర్‌కు ఆన్‌లైన్‌ చేసుకోవాలి

ఇంటి నెంబర్‌కు ఆన్‌లైన్‌ చేసుకోవాలి

గద్వాల టౌన్‌ : మున్సిపాలిటీ పరిధిలో ఇదివరకు ఇంటి నిర్మాణాలు చేపట్టి ఇంటి నెంబర్‌ పొందని వారు వెంటనే ఆన్‌లైన్‌ చేసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ నర్సింహ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశం ఈ నెల 30వరకు ఉందన్నారు. సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ద్వారా గానీ, మున్సిపల్‌ కార్యాలయంలో గానీ, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, డాక్యుమెంట్స్‌, ఇంటి నిర్మాణ అనుమతి పత్రం, ఆధార్‌కార్డు సమర్పించి ఆన్‌లైన్‌ చేసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ధరణిలో నమోదు కాదని, కారణంగా మున్సిపల్‌ సేవలతోపాటు ఖాతా మార్పిడి, ఇంటిని అమ్మడం, కొనడం కానీ జరగవ ని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


logo