శనివారం 24 అక్టోబర్ 2020
Gadwal - Sep 22, 2020 , 01:16:53

గీన్‌ చాలెంజ్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే బండ్ల

గీన్‌ చాలెంజ్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే బండ్ల

గద్వాల: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్వీకరించి సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా తన నివాసప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ చాలెంజ్‌ను హరిత యజ్ఞ రూపంలో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని చెప్పారు. సోషల్‌ మీడియా ద్వారా గద్వాల పురపాలక చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, ఉత్తనూర్‌ సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు తిరుమల్‌రెడ్డి, నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీపీలకు ఎమ్మెల్యే గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను విసిరారు. అనంతరం ఎమ్మెల్యే నాటిన మొక్కల దగ్గర ఆయన సతీమణి బండ్లజ్యోతి సెల్ఫీ దిగి గ్రీన్‌ చాలెంజ్‌ను ఎంపీపీలకు విసిరారు. కార్యక్రమంలో పురపాలక చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ ఎంపీపీ విజయ్‌కుమార్‌, కౌన్సిలర్లు నాగిరెడ్డి, రాము, రాజు, నేతలు జంబురామన్‌గౌడు, గోవిందు, శ్రీనాథ్‌, రెహమాన్‌ పాల్గొన్నారు.logo