సోమవారం 01 మార్చి 2021
Gadwal - Sep 21, 2020 , 06:42:30

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

నష్టపోయిన రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి

ఆత్మకూరు : ఇటీవల కురుస్తున్న వర్షాలకు పం ట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. జిల్లా వ్యాప్తంగా పత్తి, ఆముదం, కంది, మొక్కజొన్న, వరి పంట పొలాలు నీట మునిగి రైతులను ముంచేశాయని పేర్కొన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పర్యటించిన వారి బృందం అనేక చోట్ల పంటలు నష్టపోయిన ఘటనలను చూసినట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు కార్పొరేట్‌ కంపెనీలకు ఉపయోగపడేలా ఉందని వ్యాఖ్యానించారు. రైతులకు నష్టం చేకూర్చే వ్యవసాయ బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రసాద్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo