ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Gadwal - Sep 15, 2020 , 08:26:52

సమస్యలు పరిష్కరించాలి

సమస్యలు పరిష్కరించాలి

అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే అబ్రహం

ఉండవెల్లి  : అలంపూర్‌ నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే అబ్రహం అసెంబ్లీ జీరో అవర్‌లో సోమవారం ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ అలంపూర్‌ నియోజకవర్గంలో అధికంగా వర్షాలు కురిసి తీవ్రంగా పంట నష్టం, బీటీరోడ్డు కోతకు గురైనట్లు తెలిపారు. అలాగే అలంపూర్‌ చౌరస్తా నుంచి రాయిచూరు వరకు నిర్మించిన రోడ్డు బ్రిడ్జి పనులు అసంతృప్తిగా ఉన్నదన్నారు. త్వరగా నిధులు మంజూరు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

డయల్‌ యువర్‌ ఎమ్మెల్యే

  •  సమస్యల పరిష్కారానికి 8688114162

ఉండవెల్లి : అలంపూర్‌ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే అబ్రహం డయల్‌ యువర్‌ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు నిర్వహించనున్నట్లు  పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతిఒక్కరూ తమ సమస్యలను 8688114162 నెంబర్‌ ద్వారా తెలిపి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.


VIDEOS

logo