జూరాలలో 11 గేట్లు ఎత్తివేత

- లక్షకుపైగా ఇన్‌ఫ్లో..అవుట్‌ఫ్లో
- ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలకూ కొనసాగుతున్న వరద
- శ్రీశైలం నుంచి తొమ్మిది గేట్ల ద్వారా సాగర్‌కు నీటి విడుదల
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ : జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాలలో ఇన్‌ఫ్లో 1,15,000క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,12,007క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌లో 11గేట్లను ఎత్తి నదిలోకి 75,914 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులకుగానూ ప్రస్తుతం 1044.849 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా 9.562 టీఎంసీలుగా నిల్వ ఉన్నది. పవర్‌హౌస్‌కు 33,723 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ 5 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. ప్రాజెక్ట్ కుడి, ఎడమ, సమాంతర కాలువలతోపాటు ఎత్తిపోతల పథకాలను నీటి పంపింగ్ కొనసాగుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు కొనసాగుతుంది. ఇన్‌ఫ్లో 48,922క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 48,922 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులకుగానూ ప్రస్తుతం 1704.72 అడుగులకు చేరింది. సామర్థ్యం 128.72 టీఎంసీలు ఉండగా 128.19 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 57,218 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 63,382 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగానూ ప్రస్తుతం 1614.11అడుగులకు చేరింది. సామర్థ్యం 37.64 టీఎంసీలు ఉండగా 36.93 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
టీబీ డ్యాంకు నిలకడగా వరద
అయిజ : కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద నిలకడగా కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న మోస్తారు వర్షాలకు వరద చేరుతోంది. ఎగువన ఉన్న తుంగ జలాశయంతోపాటు నదీతీర ప్రాంతాల నుంచి 9,834 క్యూసెక్కుల వరద టీబీలోకి చేరుతుంది. సోమవారం టీబీ డ్యాంలోకి ఇన్‌ఫ్లో 9,834 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 9,570 క్యూసెక్కులు ఉంది. కర్ణాటక, ఏపీ రాష్ర్టాల పరిధిలోని ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి గానూ 1633.00 అడుగులు ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు ..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతోంది. ఎగువన కరుస్తున్న వర్షాలకు వాగులు, వంకల ద్వారా ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నీరు చేరుతున్నది. సోమవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 22,484 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 21,800 వేల క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతుండగా, ఆర్డీఎస్ ఆయకట్టుకు 684 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్ ఈఈ రామయ్య తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 10.8అడుగుల మేరకు నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
శ్రీశైలం 9గేట్లు ఎత్తిన అధికారులు
శ్రీశైలం: కృష్ణా నదీ ఎగువ రాష్ర్టాలైన మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, సుంకేసుల, హంద్రి ప్రాజెక్ట్‌లలో వరద నీటి ఉధృతి గంట గంటకు పెరుగుతూ శ్రీశైలానికి చేరుకుంటుంది. సోమవారం రాత్రి శ్రీశైలం రిజర్వాయర్‌కు ఎగువ ప్రాజెక్టుల నుంచి రెండు లక్షల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండటంతో డ్యాం 9గేట్లను పది అడుగుల ఎత్తులో తెరచి నీటి ప్రవాహాన్ని దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి 1,09,637 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 50,904 క్యూసెక్కులు, హంద్రి నుంచి 4,800 క్యూసెక్కుల (మొత్తం 1,65,341 క్యూసెక్కులు) నీరు శ్రీశైలానికి విడుదల చేయగా రాత్రి తొమ్మిది గంటల వరకు 2,32,636 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రిజర్వాయర్‌కు చేరినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా 9 గేట్లను పది అడుగుల మేర ఎత్తులో తెరిచి 2,51,432 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 30,424 క్యూసెక్కుల (మొత్తం 2,81,857 క్యూసెక్కులు ) వరద నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. ఏపీ పవర్ హౌస్ ద్వారా 31,208 క్యూసెక్కుల నీటిని వినియోగించి 15.449 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు సీఈ నర్సింహారావు తెలిపారు.
సుంకేసులకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
రాజోళి: రాజోళిలోని తుంగభద్ర నది వద్ద ఉన్న సుంకేసుల బ్యారేజీకి ఆదివారం ఇన్‌ఫ్లో కొనసాగింది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో 53వేల క్యూసెక్కులు కొనసాగుతుండగా 12గేట్లు ఎత్తి దిగువకు 52వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. కేసీ కెనాల్‌కు 1000 క్యూసెక్కుల నీటిని వదిలినట్ల్లు జేఈ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
- హాట్ టాపిక్‌గా వైష్ణవ్‌తేజ్ 3 సినిమాల రెమ్యునరేషన్
- బస్సులను అపడం లేదు.. కానీ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి
- రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న రైల్వే పోలీసులు ..వీడియో
- అతివేగం ఖరీదు : బెంజ్ కారు నడుపుతూ వ్యక్తిని బలిగొన్న టీనేజర్!
- నీరవ్ కోసం ఆర్థర్ జైలులో ఏర్పాట్లు
- భారత్‌తో చర్చలకు సిద్ధం : ఇమ్రాన్ ఖాన్
- సీటెట్ ఫలితాల విడుదల
- అందాల యాంకరమ్మకు అంతా ఫిదా..!
- మృతదేహానికీ ఉరిశిక్ష అమలు.. ఇరాన్లో ఇచ్ఛంత్రం..!
- బాలుడి చెంపకు బల్లి అచ్చు.. ఎలా జరిగిందో తెలుసా?