మంగళవారం 09 మార్చి 2021
Gadwal - Sep 09, 2020 , 04:29:24

బాలశక్తి పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

బాలశక్తి పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

గద్వాలటౌన్‌ : బాలశక్తి, కల్యాణ్‌ పురస్కారాల కోసం అర్హులైన పిల్లలు, వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు  జిల్లా సంక్షేమ అధికారి ముషాయిదా బేగం సోమవారం ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు క్రీడలు, కళలు తదిత అంశాలలో  ప్రత్యేక ప్రతిభ కనబర్చిన పిల్లలకు బాలశక్తి పురస్కారంతోపాటు లక్ష రూపాయల నగదు, మెడల్‌, సర్టిఫికెట్‌ను జనవరి 26న ప్రధానమంత్రి చేతులు మీద అందజేయడం జరుగుతుందన్నారు. బాలల అభివృద్ధి, బాలల సంరక్షణ, సంక్షేమంపై విశేష సేవలు అందించిన వ్యక్తులకు లక్ష రూపాయల నగదు, సర్టిఫికెట్‌, మెడల్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే సంస్థలకు ఐదు లక్షల నగదు, సర్టిఫికెట్‌, మెడల్‌ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన వారు నేరుగా కానీ ఆన్‌లైన్‌ ద్వారా కానీ ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

VIDEOS

logo