వరద హోరు

- పరుగులు పెడుతున్న కృష్ణమ్మ, తుంగభద్ర
- జూరాల ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేత
- ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలకూ వరద
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ : కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో వరద నిలకడగా కొనసాగుతున్నది. జూరాలకు ఇన్‌ఫ్లో 51,500 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 53,636 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 1045 అడుగులకు చేరింది. సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా 9.657 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
పవర్‌హౌస్‌కు 37,206 క్యూసెక్కులు విడుదల చేస్తూ 5 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. ప్రాజెక్ట్ కుడి, ఎడమ, సమాంతర కాలువలతోపాటు ఎత్తిపోతల పథకాలను నీటి పంపింగ్ కొనసాగుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు భారీగానే వరద వచ్చి చేరుతున్నది. ఇన్‌ఫ్లో 33,922 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 33,922 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులకుగానూ ప్రస్తుతం 1704.72 అడుగులకు చేరింది. సామర్థ్యం 128.72 టీఎంసీలు ఉండగా 128.19 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 34,430 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 31,031 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగానూ ప్రస్తుతం 1614.63 అడుగులకు చేరింది. సామర్థ్యం 37.64 టీఎంసీలు ఉండగా 37.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
టీబీ డ్యాం 10 గేట్లు ఎత్తివేత
అయిజ : కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న మోస్తరు వర్షాలకు తుంగ జలాశయానికి వరద వచ్చి చేరుతున్నది. దీంతో 6,689 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో టీబీ డ్యాంకు నమోదైంది. దీంతో ఆదివారం 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంకు 38,942 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 100.393 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 1633 అడుగుల నీటిమట్టానికిగానూ 1632.880 అడుగులకు చేరినట్లు డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువన ఉన్న టీబీ డ్యాం పది గేట్లను ఎత్తడంతో ఆనకట్టకు వరద భారీగా చేరుతున్నది. ఆదివారం 32,850 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదు కాగా 32,300 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువకు వెళ్లాయి. ఆయకట్టుకు 530 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్ ఈఈ రామయ్య తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 11 అడుగుల మేర నీటి మట్టం నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
సుంకేసులకు 7 వేల క్యూసెక్కులు
రాజోళి : సుంకేసుల జలాశయానికి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఆదివారం ఎగున ఉన్న ప్రాజెక్టుల నుంచి 7,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా.. ఒక గేటును తెరిచిన అధికారులు 4,400 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. కేసీ కెనాల్‌కు 2,700 క్యూసెక్కుల విడుదల చేసినటుల జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
శ్రీశైలం @ 884.90 అడుగులు
శ్రీశైలం : ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం గేట్లను మూసివేసినట్లు డ్యాం అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రానికి జూరాల గేట్ల ద్వారా 14,520 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 37,313 క్యూసెక్కులు కలిసి మొత్తం 51,833 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 4,345 క్యూసెక్కులు శ్రీశైలానికి విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215.3263 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇన్‌ఫ్లో 68,778 క్యూసెక్కులుగా నమోదైంది. కుడిగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం నుంచి 30,944 క్యూసెక్కులు వినియోగించి 15.529 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసినట్లు సీఈ నరసింహారావు తెలిపారు.
కోయిల్‌సాగర్ 32.6 అడుగులు
దేవరకద్ర రూరల్ : పాలమూరు జిల్లాలోని మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్ నిండుకుండను తలపిస్తున్నది. ప్రాజెక్టు నీటిమట్టం 32.6 (2.23 టీఎంసీలు) అడుగులకుగానూ పూర్తిస్థాయికి చేరింది. శనివారం రాత్రి కురిసిన వర్షాలకు ఎగువ నుంచి స్వల్పంగా వరద కొనసాగగా.. ఆదివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో అధికారులు ఒక్క గేటు తెరిచి నీటిని విడుదల చేశారు. తర్వాత వరద తగ్గడంతో ఉదయం 9 గంటలకు గేటును మూసివేశారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా 160 క్యూసెక్కులు వదులుతున్నట్లు డీఈ రవీందర్‌రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
- బెంగాల్ పోరు : శివరాత్రి పర్వదినాన తృణమూల్ మేనిఫెస్టో విడుదల!
- ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర రావత్ రాజీనామా
- షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
- దంచికొట్టిన స్మృతి మంధాన..భారత్ ఘన విజయం
- మహమ్మారి వల్ల పెళ్లిళ్లు తగ్గాయ్
- తెలంగాణ వ్యాప్తంగా అఖండ హనుమాన్ ఛాలిసా పారాయణం
- పశ్చిమ బెంగాల్లో భారీగా నాటుబాంబులు స్వాధీనం
- సంజయ్‌లీలా భన్సాలీకి కరోనా పాజిటివ్.. క్వారంటైన్లో ఆలియాభట్
- రాహుల్ ‘బ్యాక్‌బెంచ్’ వ్యాఖ్యలపై జ్యోతిరాదిత్య సింధియా కౌంటర్!
- బ్లాక్ చెయిన్ తంటా.. పేమెంట్స్ సందేశాలకు తీవ్ర అంతరాయం