సరళాసాగర్ మురిసింది

వనపర్తి/నమస్తే తెలంగాణ: ఆసియా ఖండంలో సైఫన్లతో నీటిని విడుదల చేసే రెండో ప్రాజెక్టు సరళాసాగర్. ఆదివారం తెల్లవారుజామున 4:20గంటలకు ప్రాజెక్టులో మూడు హుడ్ సైఫన్లు, ఒక ప్రైమ్ సైఫన్ ఆటోమెటిక్‌గా తెరుచుకున్నది. 11ఏండ్ల తర్వాత సైఫన్లు తెరుచుకోవడంతో పర్యాటకులు పెద్దఎత్తున తిలకిస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 0.5టీఎంసీలకు గానూ సైఫన్ల ద్వారా 1089 క్యూసెక్కలు దిగువకు విడుదలవుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా వనపర్తి జిల్లాలో 10గ్రామాల్లో 4,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుంది. గతేడాది తెగిపోయిన కట్టకు మరమ్మతులు చేయడంతో ఈ ఏడాది నీటి నిల్వ పెరిగి సైఫన్లు తెరుచుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టు నేపథ్యం
వనపర్తి చివరి సంస్థానాధీశులు రాజా రామేశ్వర్రావు 1949 సెప్టెంబర్ 15న ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించేందుకు సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. రూ.35లక్షలు వెచ్చించి 1959 మే 1న నిర్మాణం పూర్తిచేశారు. 1959 జూలై 26న మొదటిసారిగా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి నర్సింగరావు కాల్వ ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఆటోమెటిక్ సైఫన్ ఓపెన్ సిస్టంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నుంచి 1960లో మొదటిసారిగా సైఫన్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత వరుసగా మూడేండ్లు భారీ వర్షాలు కురువడంతో 1963 వరకు తెరుచుకున్నాయి. 1964లో అతి భారీ వర్షాలు రావడంతో శంకరసముద్రం ఆనకట్ట తెగిపోయి సరళాసా గర్‌కు నీరు చేరుకోవడంతో సరళాసాగర్ కట్ట తెగిపోయిం ది. దీంతో నీటి ఉధృతి తట్టుకునేందుకు అలుగు ఏర్పాటు చేశారు. అనంతరం 1967 నుంచి 1970 వరకు సరళాసాగర్ సైఫన్లు తెరుచుకున్నాయి. తిరిగి 1974 నుంచి 1981 వరకు 1988,90,91,93, 98లో సైఫన్లు తెరుచుకున్నాయి. చివరగా 2009లో.., 2019లో సైఫన్లు తెరుచుకునే సమయంలోనే కట్ట తెగిపోవడంతో నీరంతా నదిలోకి వెళ్లాయి.
ప్రాజెక్టు సామర్థ్యం
ఈ ప్రాజెక్టు సామర్థ్యం 0.5టీఎంసీల కెపాసిటీ ఉండగా 771 ఎకరాల్లో 1,372 మెట్రిక్ క్యూబిక్ ఫీట్లలో విస్తరించి ఉన్నది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1089 అడుగులు ఉండగా 1089.25 అడుగులకు నీరు వస్తే సైఫన్లు ఆటోమెటిక్‌గా ఓపెన్ అవుతాయి. 1095 అడుగులకు నీరు చేరితే ప్రాజెక్టులో అన్ని సైఫన్లు తెరుచుకుంటాయి. ప్రాజెక్టు బెడ్ లెవల్ 1054 అడుగులు ఉండగా 1067 అడుగులకు నీరు చేరితే ఎడమకాల్వ ద్వారా, 1072 అడుగులు కుడి కాల్వకు నీరు చేరుతుంది. ఎడమ కాల్వ ద్వారా 82 క్యూసెక్కుల నీరు విడుదలై 16కిలోమీటర్ల పాటు ప్రవహించి 8 గ్రామాల్లోని 3,769.20ఎకరాలకు సాగునీరు అందుతున్నది. కుడి కాల్వ ద్వారా 6.89 క్యూసెక్కుల నీరు విడుదలై 4.50కి.మీ పాటు ప్రవహించి రెండు గ్రామాల్లోని 388.22 ఎకరాలకు సాగునీరు చేరుతుంది. ప్రాజెక్టులో 17 హుడ్ సైఫన్లు, నాలుగు ప్రైమ్ సైఫన్లు ఏర్పాటు చేశారు.
సైఫన్ సిస్టం గేట్లు
ఏనుగుతొండం ఆకారంలో ఉండే ఒక్కో హుడ్సైఫన్ ద్వారా 3,444 క్యూసెక్కుల నీటి చొప్పున అన్ని సైఫన్లు 17 తెరుచుకుంటే 58,500 క్యూసెక్కులు దిగువకు విడుదలవుతాయి. ఒక్కో ప్రైమ్ సైఫన్ ద్వారా 500 క్యూసెక్కుల నీటి చొప్పున 4 ప్రైమ్ సైఫన్లు తెరుచుకుంటే 2000 క్యూసెక్కులు విడుదలవుతాయి. పూర్తిస్థాయి నీటిమట్టం 1089 అడుగులుండగా 1089.25 అడుగులకు నీరు చేరుకుంటే ఆటోమెటిక్‌గా సైఫన్లు తెరుచుకుంటాయి. ప్రతి 0.25 అడుగులు పెరిగే కొద్ది ప్రాజెక్టులో 3 హుడ్ సైఫన్లు, ఒక ప్రైమ్ సైఫన్ తెరుచుకుంటుంది. ప్రస్తుతం 1089.25 అడుగులకు చేరుకోవడంతో ప్రాజెక్టులో 3 హుడ్ సైఫన్లు, ఒక ప్రైమ్ సైఫన్ ద్వారా 1089 క్యూసెక్కులు విడుదలవుతుంది.
10 గ్రామాల్లో 42వేల ఎకరాలు
కొత్తకోట, మదనాపురం మండలంలోని 10 గ్రామాలకు సాగునీరు చేరుతుంది. ఎడమ కాల్వ ద్వారా మదనాపురం మండలంలోని శంకరమ్మపేట, దంతనూరు, మదనాపురం, తిర్మలాయపల్లి, రామన్‌పాడు, అజ్జకోలు, కొన్నూరు, నర్సింగాపురంలోని 3,769.20ఎకరాలకు, కొత్తకోట మండలం రామానంతపురం, చర్లపల్లి గ్రామాల్లోని 388.22 ఎకరాలకు సాగునీరు చేరుతుంది.
చాలా సంతోషకరం
ప్రాజెక్టులోని 3 హుడ్ సైఫన్లు, ఒక ప్రైమ్ సైఫన్ ద్వారా 1089 క్యూసెక్కులు విడుదలవుతున్నది. 11ఏండ్ల తర్వాత సైఫన్లు తెరుచుకోవడం చాలా సంతోషకరం. నీటి ప్రవాహం పెరిగే ప్రతి 0.25 అడుగుల పెరుగుదలకు సైఫన్లు ఆటోమెటిక్‌గా తెరుచుకుంటాయి.
తాజావార్తలు
- నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ‘మహా’ నమూనాలు
- ఇండో-పాక్ సంబంధాల్లో కీలక పరిణామం.. మళ్లీ చర్చలు షురూ!
- రెచ్చిపోయిన పృథ్వీ షా.. మెరుపు డబుల్ సెంచరీ
- కఠిక పేదరికాన్ని నిర్మూలించాం.. ప్రకటించిన చైనా అధ్యక్షుడు
- కళ్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు
- షాకింగ్ : పక్కదారి పట్టిందనే ఆగ్రహంతో భార్యను హత్య చేసి..
- క్రికెట్లో ఈయన రికార్డులు ఇప్పటికీ పదిలం..
- పవన్ కళ్యాణ్‌తో జతకట్టిన యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్
- వీడియో : గంటలో 172 వంటకాలు
- ఫలక్‌నుమాలో భారీగా లభించిన పేలుడు పదార్థాలు