శనివారం 16 జనవరి 2021
Gadwal - Aug 14, 2020 , 01:23:48

పంచాయతీ కార్యదర్శుల కార్యవర్గం ఏర్పాటు

పంచాయతీ కార్యదర్శుల కార్యవర్గం ఏర్పాటు

ఆత్మకూరు : పంచాయతీ కార్యదర్శుల నూతన మండల కార్యవర్గాన్ని గురువారం ఎంపీడీవో కార్యాలయంలో మండల పంచాయతీ కార్యదర్శులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తిప్డంపల్లి నరసింహస్వామి, ఉపాధ్యక్షులుగా మూలమల్ల యశోద, మోట్లంపల్లి వెంకటయ్య, జూరాల రవిప్రకాశ్‌, గౌరవ అధ్యక్షుడిగా కత్తెపల్లి నరేశ్‌, కోశాధికారిగా ఆరెపల్లి మనోహర్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శిగా పిన్నెంచెర్ల మురళీధర్‌, జాయింట్‌ సెక్రటరీగా శరత్‌చంద్ర, మీడియా సెల్‌ కన్వీనర్‌గా జైపాల్‌రెడ్డి, ముఖ్య సలహాదారులుగా రాకేశ్‌, బాలకిష్టాపూర్‌ మహబూబ్‌ఖాన్‌, కార్యవర్గ సభ్యులుగా శంకర్‌, పరిమళ ఎన్నికయ్యారు. నూతనంగా కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.