ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Gadwal - Aug 11, 2020 , 04:17:24

జూరాలకు 1.95 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

జూరాలకు 1.95 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  • 25 గేట్లు, పవర్‌హౌస్‌ ద్వారా 1,96,531 క్యూసెక్కులు విడుదల
  • శ్రీశైలంలో 109 టీఎంసీల నిల్వ
  • రైతు ఉత్పత్తి సంస్థల కింద నాగర్‌కర్నూల్‌ ఎంపిక
  • ఐదేండ్లపాటు ప్రత్యేక కార్యాచరణ
  • ఎఫ్‌పీవో కింద ప్రణాళిక

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ : జూరాలకు వరద భారీ గా కొనసాగుతున్నది. సోమవారం సాయంత్రం ఇన్‌ఫ్లో 1,95,000, అవుట్‌ఫ్లో 1,96,531 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీ టి మట్టం 1045 అడుగులు, నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్ర స్తుతం 1042.585 అడుగుల్లో 8.184 టీఎంసీల నీటి నిల్వ ఉన్న ది. 25 గేట్లను ఎత్తి 1,65,622 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. పవర్‌హౌస్‌కు 28,049 క్యూసెక్కులు వి డుదల చేస్తున్నారు. కుడికాలువకు 843, ఎడమ కాలువకు 900, సమాంతర కాలువకు 300, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఆల్మట్టి ప్రాజెక్ట్‌ ఇన్‌ఫ్లో 1,85,001, అవుట్‌ఫ్లో 1,81,922 క్యూసెక్కులు నమోదైంది. పూర్తి స్థాయి నీటి మ ట్టం 1,705 అడుగులు, నిల్వ 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1698.26 అడుగుల్లో 96.22 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌ ఇన్‌ఫ్లో 1,91,211, అవుట్‌ఫ్లో 1,86,942 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1615 అడుగు లు, నిల్వ 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1610. 73 అడుగుల్లో 31.89 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. 

నిండుకుండలా తుంగభద్ర

అయిజ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాలోని గాజనూరు వద్ద ఉన్న తుంగ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగ డ్యాం నుంచి 49,261 క్యూసెక్కుల నీటిని టీబీ డ్యాంకు వదులుతున్నారు. సోమవారం టీబీ డ్యాం ఇన్‌ఫ్లో 1,07,012, అవుట్‌ఫ్లో 9,568 క్యూసెక్కులుగా నమోదైంది. ఏపీ, కర్ణాటక తాగు, సాగునీటి అవసరాలకు హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, ఎల్‌బీఎంసీ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. 1633 అడుగుల నీటి మ ట్టం, 100.86 టీఎంసీల నిల్వ కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 1625.95 అడుగుల్లో 75.954 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు డ్యాం సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. 

ఆర్డీఎస్‌కు వరద తగ్గుముఖం

ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద తగ్గుముఖం పడుతున్నది. ఎగువన వర్షాలు తగ్గడంతో ఆనకట్టకు వరద నిలిచిపోయింది. సోమవారం ఆర్డీఎస్‌ ఆనకట్టకు 860 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 600 క్యూసెక్కులు కన్‌స్ట్రక్షన్‌ స్లూయిస్‌ ద్వారా దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆర్డీఎస్‌ ప్రధాన కాల్వకు 260 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఈఈ రామయ్య తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్‌ ఆనకట్టలో 4.5 అడుగుల మేర నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.

సుంకేసులకు..

రాజోళి : సుంకేసుల బ్యారేజీకి సోమవారం 800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 1.2 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ఒక టీఎంసీ నీరు ఉన్నట్లు జేఈ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. కేసీ కెనాల్‌కు 1,100 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 

శ్రీశైలం @ 109 టీఎంసీలు 

శ్రీశైలం : జూరాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకున్నది. ఒక్క రోజులోనే సుమారు 10 టీఎంసీలకు పైగా వరద వచ్చింది. జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల ద్వారా 1,65,622, పవర్‌జనరేషన్‌ ద్వారా 28,049 క్యూ సెక్కులు (మొత్తం 1,93,671 క్యూసెక్కులు) దిగువకు విడుదల చేశారు. సోమవారం రాత్రి శ్రీశైలం జలాశయానికి 1,93,215 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో నమోదైంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ 215 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 861.20 అడుగుల్లో 109.8070 టీఎంసీల నిల్వ ఉన్నది. ఎడమగట్టు (టీఎ స్‌ జెన్‌కో) భూగర్భ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 42,831 క్యూసెక్కుల నీటిని వినియోగించి 19.850 మిలియన్‌ యూనిట్లు విద్యుదుత్పత్తి చేసి గ్రిడ్‌కు తరలించినట్లు సీ ఈ ప్రభాకర్‌రావు తెలిపారు. ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 38,140 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు విడుదలవుతున్నది. logo