ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Gadwal - Aug 10, 2020 , 03:10:51

పల్లె ప్రకృతి వనాలను త్వరితగతిన పూర్తి చేయాలి

పల్లె ప్రకృతి వనాలను త్వరితగతిన పూర్తి చేయాలి

గద్వాల రూరల్‌ : గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తలపెట్టిన పల్లెప్రకృతి వనాలను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష పేర్కొన్నారు. మండలంలోని వీరాపురం గ్రామంలో ఆదివారం సెగ్రిగేషన్‌ షెడ్‌, పల్లెప్రకృతి వనం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందడానికి గ్రామీణ ఉపాధిహామీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రకృతి వనాలు దోహదపడుతాయన్నారు. వానకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వీరాపురం గ్రామ పంచాయతీని మోడల్‌ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని సర్పంచ్‌ స్వప్నకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్‌ గౌడ్‌, డీఆర్‌డీవో ఉమాదేవి, ఎంపీడీవో సూరి, ఎంపీఈవో చెన్నయ్య, ఏపీవో శివజ్యోతి, పంచాయతీ కార్యదర్శి మురళీ, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.logo