మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Gadwal - Aug 10, 2020 , 02:43:07

కరోనా పేషెంట్ల ఆకలి తీర్చుతున్న మిత్ర బృందం

కరోనా పేషెంట్ల ఆకలి తీర్చుతున్న మిత్ర బృందం

అయిజ : పట్టణంలోని కేజీబీవీ పాఠశాల క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లకు 1992-93 జెడ్పీహెచ్‌ఎస్‌ అయిజ బాలుర పాఠశాల టెన్త్‌ బ్యాచ్‌ మిత్ర బృందం సభ్యులు ఆకలి తీర్చుతున్నారు. గత శుక్రవారం నుంచి మధ్యాహ్నం వేళ భోజనం అందిస్తున్నట్లు మిత్ర బృందం సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులను విడిచి క్వారంటైన్‌లో ఉన్న కరోనా బాధితులకు పౌష్టికాహారంతో కూ డిన భోజనం అందించాలనే దృక్పథంతో శుచి, శుభ్రతతో కూడిన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. తాము చేస్తున్న ఈ మంచి పనికి మిత్రులు కొందరు నగదు సాయం అందిస్తున్నారని తెలిపారు. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న పేషెంట్లకు భోజనం అందించాలని టెన్త్‌ బ్యాచ్‌ మిత్ర బృందం సంకల్పించిందని సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.  


logo