శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Gadwal - Aug 09, 2020 , 02:34:22

ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండాలి

 ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండాలి

ఆత్మకూరు : పట్టణంలోని ఇందిరానగర్‌లో శానిటైజేషన్‌ నిర్వహించారు. శనివారం కౌన్సిలర్‌ పోషన్న నేతృత్వంలో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఇందిరానగర్‌లోనే దాదాపు ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో కాలనీ మొత్తం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శానిటైజేషన్‌ చేశారు. ఈ సందర్భంగా పోషన్న మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మాస్కు ధరించి బయటకు రావాలన్నారు. తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని సూచించారు. స్థానిక సర్కారు దవాఖానలో శనివారం 11 కరోనా పరీక్షలు నిర్వహించగా 6 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆత్మకూరులో 3, చిన్నచింతకుంట 2, తండాలో 1 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆత్మకూరు సీహెచ్‌సీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు విస్తృతంగా నమోదవుతున్నాయి. ఆత్మకూరు మండలంలో 31 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా పట్టణంలో 14 కేసులు నమోదయ్యాయి. అమరచింత మండలంలో 22 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా అమరచింతలో 16 కేసులు నమోదయ్యాయి. ఇంతవరకు సర్కారు దవాఖాన పరిధిలో 95 పరీక్షలు నిర్వహించగా 43 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. logo