శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Gadwal - Aug 09, 2020 , 02:34:24

తెగిన భీమా కాలువ పరిశీలన

తెగిన భీమా కాలువ పరిశీలన

పెబ్బేరు రూరల్‌ (శ్రీరంగాపురం) : శ్రీరంగాపురం రంగసముద్రం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పరిధిలోని భీమా డిస్ట్రిబ్యూటరీ కింద ఉన్న పంట కాలువ ఇటీవల తెగిపోయింది. రంగసముద్రానికి నాగరాల వాగు నుంచి పెద్ద ఎత్తున వరదనీరు వస్తుండంటంతో నీటి ఉధృతికి అది ధ్వంసమై కాలువ పరిధిలోని వరి పైర్లు నీటిలో కొట్టుకపోయాయి. ఈ విషయాన్ని జెడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ భీమా అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో శనివారం భీమా ఏఈఈ దేవరాజు కాలువ దగ్గరికి వెళ్లి పరిశీలించారు. తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. కాగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని జెడ్పీటీసీ విజ్ఞప్తి చేశారు. 


logo