ఆదివారం 07 మార్చి 2021
Gadwal - Aug 09, 2020 , 01:57:21

జ‌ల‌వేణి

జ‌ల‌వేణి

  • కృష్ణమ్మకు వరద పోటు
  •  జూరాల ప్రాజెక్టు 28 గేట్లు ఎత్తివేత
  • ఇన్‌ఫ్లో 2,10,000, అవుట్‌ఫ్లో 2,21,026 క్యూసెక్కులు
  • ఆల్మట్టి, నారాయణపూర్‌కు భారీగా..

   జల‘వేణి’ పరవళ్లు తొక్కుతున్నది. కర్ణాటక, మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మకు వరద పోటెత్తుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంల గేట్లను ఎత్తడంతో దిగువకు గలగల పారుతూ వస్తున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు  వద్ద భారీగా వరద నమోదవుతుండటంతో 28 స్పిల్‌వే గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 2,10,000, అవుట్‌ఫ్లో 2,21,026 క్యూసెక్కులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.  తుంగభద్ర డ్యాంకు   భారీగా.., ఆర్డీఎస్‌కు స్వల్పంగా ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. శ్రీశైలం డ్యాంలో క్రమక్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది.

- జోగుళాంబ గద్వాల/నమస్తే తెలంగాణ/అయిజ/శ్రీశైలం


 జోగుళాంబ గద్వాల/నమస్తే తెలంగాణ : కృష్ణమ్మకు వరద పోటెత్తుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలకు వరద భారీగా నమోదవుతున్నది. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం జూరాల ప్రాజెక్టులోని 28 స్పిల్‌వే గేట్లను ఎత్తి 1,99,772 క్యూసెక్కులు శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 2,10,000 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 2,25,348 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1045 అడుగులకుగానూ ప్రస్తుతం 1042.651 అడుగులకు చేరింది. సామర్థ్యం 9.6 టీఎంసీలు ఉండగా.. 8.222 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పవర్‌హౌస్‌కు 22,634 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. కుడి కాలువ ద్వారా 738 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 750 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎత్తిపోతల పథకాలకు నీటి పంపింగ్‌ కొనసాగుతున్నది. నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌-2కు 750 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. అలాగే కర్ణాటకలోని ఆల్మట్టికి భారీగా వరద నమోదవుతున్నది. శనివారం ఇన్‌ఫ్లో 1,51,598 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,75,672 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులకుగానూ ప్రస్తుతం 1698.85 అడుగులకు చేరింది. సామర్థ్యం 129.72 టీఎంసీలకుగానూ 98.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. వరద పెరగడంతో స్పిల్‌వే గేట్ల ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. ఇన్‌ఫ్లో 1,79,341 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,86,389 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగానూ ప్రస్తు తం 1610.24 అడుగులకు చేరింది. సామ ర్థ్యం 37.64 టీఎంసీలు ఉండగా.. 31.27 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 

టీబీ డ్యాంకు భారీగా.. 


అయిజ : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో జలాశయానికి లక్ష క్యూసెక్కులకుపైగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో 22 గేట్ల ద్వారా దిగువకు 70,375 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం డ్యాంలోకి ఇన్‌ఫ్లో 1,02,467 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 9,532 క్యూసెక్కులుగా నమోదైంది. ఏపీ, కర్ణాటక తాగు, సాగునీటి అవసరాల కోసం హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, ఎల్‌బీఎంసీ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. 100.86 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 57.870 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 1633 అడుగుల నీటి మట్టానికిగానూ 1619.87 అడుగులకు చేరినట్లు డ్యాం సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. భద్ర డ్యాం గేట్లు కూడా నేడో.. రేపో తెరిచే అవకాశం ఉందన్నారు. ఆదివారం టీబీ డ్యాంకు వరద లక్షన్నర క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

శ్రీశైలంలో పెరుగుతున్న నీటిమట్టం


శ్రీశైలం : కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో శ్రీశైలం జలాయశానికి భారీగా వరద రాక మొదలైంది. శనివారం ఉదయం జలాశయంలో నీటిమట్టం స్థిరంగా ఉండగా.. సాయంత్రానికి లక్ష క్యూసెక్కులకు నీళ్లు చేరాయి. జూరాల నుంచి 2,19,618 క్యూసెక్కులు విడుదల కాగా.. డ్యాంలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ 849.90 అడుగులుగా నమోదైంది. అదేవిధంగా సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత 79.8115 టీఎంసీలు నిల్వ ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లో 98,765 క్యూ సెక్కులు, అవుట్‌ఫ్లో 38,140 క్యూసెక్కులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుండగా.. కుడిగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగడం లేదు.

ఆర్డీఎస్‌ ఆనకట్టకు స్వల్పంగా..