ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Gadwal - Aug 08, 2020 , 03:19:36

వైరస్‌ సోకిన ప్రతి ఒక్కరికీ కిట్లు సరఫరా

వైరస్‌ సోకిన ప్రతి ఒక్కరికీ కిట్లు సరఫరా

గద్వాలటౌన్‌ : కరోనా వైరస్‌ సోకిన ప్రతి ఒక్కరికీ కిట్లు తప్పక పంపిణీ చేయాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో చందునాయక్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో శుక్రవారం కొవిడ్‌-19 కంటైన్మెంట్‌ ఫెక్ల్సీలను, స్టిక్కర్లను ఆయనతో పాటు వైద్యాధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరస్‌ సోకిన ప్రతి ఇంటికీ స్టిక్కర్లను అంటించి ఈ స్టిక్కర్‌పై పూర్తి వివరాలు రాయాలని సిబ్బందికి సూచించారు. అలాగే కిట్స్‌ల్లోని  మందులను సక్రమంగా వాడే విధంగా వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం సిబ్బంది వైరస్‌ సోకిన ఇండ్లకు స్టిక్కర్లు అంటించి కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు రామకృష్ణ, మల్లికార్జున్‌, మధుసూదన్‌రెడ్డి, రమేశ్‌, వరలక్ష్మి, విజయభాస్కర్‌, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.


logo