శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Gadwal - Aug 08, 2020 , 03:19:36

ప్రతి ఒక్కరి అభివృద్ధే లక్ష్యం

ప్రతి ఒక్కరి అభివృద్ధే లక్ష్యం

  • l అదనపు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

గద్వాల : జిల్లాలోని అర్బన్‌ పురపాలక సంఘాలతో పాటు అన్ని గ్రామ పంచాయతీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు పరుస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందే విధంగా తన వంతు కృషి చేస్తానని అదనపు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. 2018 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి శుక్రవారం ఉదయం కలెక్టర్‌ శృతిఓఝాతో కలిసిన అనంతరం సీటీపీలపై సంతకాలు చేసి అదనపు కలెక్టర్‌ అర్బన్‌ లోకల్‌ బాడీగా విధులకు రిపోర్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలతోపాటు 255 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తానన్నారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో తనకు అప్పగించిన విధులు వందశాతం విజయవంతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో హరితహారం, రైతు వేదికల నిర్మాణం, పల్లెప్రకృతి వనాల ఏర్పాటును లక్ష్యానికి అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పనికావాలనుకున్న ప్రతి ఒక్కరికీ పని దినాలు కల్పించడమే కాకుండా వారికి ప్రభుత్వం నిర్ధేశించిన దినసరి కూలీ రోజులు 220 వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని  తెలిపారు. 


logo