గురువారం 25 ఫిబ్రవరి 2021
Gadwal - Aug 08, 2020 , 02:30:22

ఉర‌క‌లేస్తున్న కృష్ణమ్మ

ఉర‌క‌లేస్తున్న  కృష్ణమ్మ

  • జూరాల ఏడు గేట్లు ఎత్తివేత
  • ఇన్‌ఫ్లో 25,000, అవుట్‌ఫ్లో 53,393 క్యూసెక్కులు
  • ఆల్మట్టి డ్యాంకు భారీగా వరద
  • ఇన్‌ఫ్లో 1,26,374, అవుట్‌ఫ్లో 94,340 
  • నారాయణపూర్‌ ఇన్‌ఫ్లో 79,285, అవుట్‌ఫ్లో 99,642 క్యూసెక్కులు 

కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఆల్మట్టి డ్యాంకు ఇన్‌ఫ్లో 1,26,374 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 94,340 క్యూసెక్కులు.., నారాయణ పూర్‌ డ్యాంకు ఇన్‌ఫ్లో 79,285 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 99,642 క్యూసెక్కులు నమోదైంది. దీంతో రెండు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతూ వస్తున్నది. శుక్రవారం సాయంత్రం ప్రాజెక్టులోని 7 గేట్లను ఒక మీటర్‌ ఎత్తుకు ఎత్తి శ్రీశైలం వైపు నీటిని వదిలారు. ఇన్‌ఫ్లో 25,000, అవుట్‌ఫ్లో 53,393 క్యూసెక్కులుగా నమోదైంది. 

- జోగుళాంబ గద్వాల/నమస్తే తెలంగాణ జోగుళాంబ గద్వాల/నమస్తే తెలంగాణ : జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద తరలివస్తున్నది. దీంతో శుక్రవారం సాయంత్రం ప్రాజెక్టు 7 క్రస్ట్‌గేట్లను ఒక మీటరు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 25,000, అవుట్‌ఫ్లో 53,393 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1045 అడుగులకుగా నూ ప్రస్తుతం 1038.156 అడుగులుగా నమోదైంది. డ్యాం సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా.. 5.836 టీఎంసీలుగా నమోదైంది. స్పిల్‌వే ద్వారా 25,032, పవర్‌హౌస్‌కు 25,650 క్యూసెక్కులు విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. కుడి కాలువ 513, ఎడమ కాలువ 750, సమాంతర కాలువ ద్వారా 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎత్తిపోతల పథకాలైన నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఇన్‌ఫ్లో 1,26,374 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 94,340 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులకుగానూ ప్రస్తుతం 1699.34 అడుగులకు చేరింది. సామర్థ్యం 129.72 టీఎంసీలు ఉండగా.. 101.03 టీఎంసీలుగా నమోదైంది. వరద ప్రవాహం పెరగడంతో స్పిల్‌వే గేట్ల ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. ఇన్‌ఫ్లో 79,285 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 99,642 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగానూ ప్రస్తుతం 1610.89 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలు ఉండగా.. 32.10 టీఎంసీలుగా నమోదైంది. VIDEOS

logo