శనివారం 27 ఫిబ్రవరి 2021
Gadwal - Aug 07, 2020 , 04:31:11

ఆల్మట్టి డ్యాంకు పెరిగిన వరద

ఆల్మట్టి డ్యాంకు పెరిగిన వరద

n జూరాల ఇన్‌ఫ్లో 12,000, అవుట్‌ ఫ్లో 33,330 క్యూసెక్కులు

n ఆల్మట్టి ఇన్‌ఫ్లో 1,10,000, అవుట్‌ఫ్లో 70,000 క్యూసెక్కులు

n నారాయణపూర్‌ ఇన్‌ఫ్లో 70,000, అవుట్‌ఫ్లో 78,900 క్యూసెక్కులు

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ: కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. గురువారం ఆల్మట్టి ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 1,10,000 క్యూసెక్కులు నమోదు కాగా 70,000 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో  నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,705 అడుగుల్లో  129.72 టీఎంసీలుండగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1699.28 అడుగుల్లో 100.73 టీఎంసీలు నిల్వ ఉన్నది. ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో స్పిల్‌వే గేట్ల ద్వారా భారీగా నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నారాయణపూర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఇన్‌ఫ్లో 70,000 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 78,900 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,615 అడుగుల్లో 37.64 టీఎంసీలుండగా ప్రస్తుతం 1,612.40 అడుగుల్లో  34.08 టీఎంసీలు నిల్వ ఉన్నది. జూరాలకు హెచ్చుతగ్గులుగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. గురువారం సా యంత్రానికి జూరాలకు ఇన్‌ఫ్లో 12,000 క్యూసెక్కులుండగా అవుట్‌ఫ్లో 33,330 క్యూసెక్కులు నమోదైంది.  ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగుల్లో 9.6టీఎంసీలుండగా ప్రస్తుతం 1042.684 అడుగుల్లో 8.241 టీఎంసీలు నిల్వ ఉన్నది. ఫవర్‌హౌస్‌కు 30,817 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి చేస్తున్నారు. కుడి కాలువ ద్వారా 352 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 750 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎత్తిపోతల పథకాలకు నీటి పంపింగ్‌ కొనసాగుతున్నది. నెట్టెంపాడు 750 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.

VIDEOS

logo