బుధవారం 03 మార్చి 2021
Gadwal - Aug 05, 2020 , 02:08:16

జూరాలకు తగ్గుతున్న వరద

జూరాలకు తగ్గుతున్న వరద

జోగుళాంబ గద్వాల/నమస్తే తెలంగాణ: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద కొనసాగుతున్నది. మంగళవారం ఎగువ నుంచి 11,500వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదు కాగా.. అవుట్‌ఫ్లో 13,774 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుతం నీటిమట్టం 1,044.193 అడుగులకు చేరగా, 9.152 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. పవర్‌హౌస్‌కు 10,176 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. కుడి కాలువకు 621 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 600, సమాంతర కాలువకు 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడ్‌కు 750, భీమా-1కు 650 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు 6,540 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా.. అవుట్‌ఫ్లో 1,922 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు నీటిమట్టం 1697.77 అడుగులకు చేరి 94.11 టీఎంసీలు నిల్వ ఉన్నది. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,110 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 4,878 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు నీటిమట్టం 1614.09 అడుగులకు చేరి, ప్రస్తుతం 33.51 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

తుంగభద్ర జలాశయానికి స్థిరంగా వరద

అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి మంగళవారం ఇన్‌ఫ్లో 6,575 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 7,595 క్యూసెక్కులుగా నమోదైంది. ఏపీ, కర్ణాటక తాగు, సాగునీటి అవసరాల కోసం హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, ఎల్‌బీఎంసీ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం ప్రస్తుతం 39.694 టీఎంసీల నీటితో 1612.23 అడుగులకు చేరిందని డ్యాం సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. కర్ణాటకలోని ఆర్డీఎస్‌ ఆనకట్టకు మంగళవారం ఆనకట్టకు 1,200 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదు కాగా.. ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీ 950 క్యూసెక్కులు వెళ్లాయి. ఆర్డీఎస్‌ ప్రధాన కాల్వకు 350 క్యూసెక్కుల నీరు చేరుతుందని కర్ణాటక ఆర్డీఎస్‌ ఈఈ రామయ్య తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 7.5 అడుగుల మేర నీటిమట్టం నిల్వ ఉందని పేర్కొన్నారు. 

శ్రీశైలం @ 81.0918 టీఎంసీలు

శ్రీశైలం: ఎగువ నుంచి వరద వస్తుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతన్నది. జూరాల ప్రాజెక్టు నుంచి 10,176 క్యూసెక్కులు, హంద్రి నుంచి 250 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. జలాశయం నీటిమట్టం 850.50 అడుగులకు చేరి, 81.0918 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇన్‌ఫ్లో 10,426 క్యూసెక్కులుగా నమోదైందని అధికారులు వెల్లడించారు. జలాశయం నుంచి 40,259 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. 


VIDEOS

logo