సోమవారం 01 మార్చి 2021
Gadwal - Aug 03, 2020 , 03:58:57

పరిశుభ్రత పాటించాలి

పరిశుభ్రత పాటించాలి

  • మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌

గద్వాలటౌన్‌ : ప్రతిఒక్కరూ పరిశుభ్రతను తప్పనిసరి పాటించాలని మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 16, 17, 18 వార్డుల్లో ఆదివారం చేపట్టిన శానిటైజేషన్‌ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు చేశారు. పరిసరాల శుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రతను ప్రతిఒక్కరూ పాటించాలని చెప్పారు. అలాగే మున్సిపల్‌ విభాగ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వార్డుల్లో పేరుకుపోయిన పారిశుధ్యాన్ని ప్రతి రోజు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం సరికాదని సూచించారు. 

VIDEOS

logo