శనివారం 08 ఆగస్టు 2020
Gadwal - Aug 02, 2020 , 07:41:07

ఆస్తిపన్నుపై 90శాతం అపరాధ రుసుం మాఫీ

ఆస్తిపన్నుపై 90శాతం అపరాధ రుసుం మాఫీ

గద్వాలటౌన్‌ : మున్సిపాలిటీ ఆస్తిపన్నును దీర్ఘకాలికంగా చెల్లించకుండా బకాయి పడ్డ బకాయిదారులకు 90శాతం అపరాధ రుసుం మాఫీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ నర్సింహ శనివారం ప్రకటనలో తెలిపారు. 2019-20వరకు బకాయి పడ్డ మొత్తాన్ని చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందన్నారు. బకాయిలు చెల్లించేందుకు వచ్చేనెల 19వరకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


logo