శనివారం 06 మార్చి 2021
Gadwal - Jul 28, 2020 , 03:53:45

జూరాల గేట్లు మూసివేత

జూరాల గేట్లు మూసివేత

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ : జూరాలకు వరద తగ్గుముఖం పట్టడంతో గేట్లు మూసేశారు. సోమవారం రాత్రికి జూరాల ఇన్‌ఫ్లో 35,000, అవుట్‌ఫ్లో 34,219 క్యూసెక్కులుగా నమోదైంది. కేవలం పవర్‌హౌస్‌కు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1045 అడుగులు, నీటినిల్వ 9.657 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 1044.324 అడుగుల్లో 9.234 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. పవర్‌హౌస్‌కు 29,169 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి చేస్తున్నారు. కుడికాలువకు 475, ఎడమ కాలువకు 900, సమాంతర కాలువకు 800, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 1,500, భీమా లిప్ట్‌-1కు 650, కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌కు 630 క్యూసెక్కులు వదులుతున్నారు. 

ఆల్మట్టి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 17,070, అవుట్‌ఫ్లో 6,746 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1705 అడుగులు, నిల్వ 129.72 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 1696.92 అడుగుల్లో  90.53 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 

నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 4,565, అవుట్‌ఫ్లో 8,050 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1615 అడుగులు, నిల్వ 37.64 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 1613.09 అడుగుల్లో  35.06 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 

VIDEOS

logo