కొవిడ్ దందా

- l ప్రైవేట్ ల్యాబ్‌ల్లో యథేచ్ఛగా పరీక్షలు
- l ఇష్టారీతిగా డబ్బుల వసూళ్లు
- l చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
గద్వాలటౌన్: జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. జనాలు కూడ అదే రేంజ్లో భయాందోళనలకు గురవుతున్నారు. ఏ చిన్న రోగమొచ్చినా కరోనా వచ్చిందేమోనని బెంబెలెత్తుతున్నారు. ఏ లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ వస్తుండడంతో తమకు ఉందేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ జిల్లా దవాఖానలో, కొవిడ్-19 ల్యాబ్‌లలో లక్షణాలు ఉంటేనే పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదే ఆసరాగా తీసుకున్న కొందరు ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులు కరోనా దందాకు తెరలేపారు. ఇందుకు ప్రభుత్వ అధికారులు కూడా తోడయ్యారు. ఇంకేముంది వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా జోరందుకున్నది.
యథేచ్ఛగా పరీక్షలు
జిల్లాలోని జిల్లా దవాఖానలో ప్రత్యేకంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అలాగే జిల్లా ఏరియా దవాఖానతో పాటు అన్ని మండలాల పీహచ్సీలలో ర్యాపిడ్ కిట్ మెథడ్ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాని ప్రైవేట్ దవాఖానలకు గాని ల్యాబ్‌లకు గాని ప్రభుత్వం పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే జిల్లా కేంద్రంలోని కొన్ని ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నవరంగ్ టాకీస్ ప్రాంతం లో ఉన్న ఓ ల్యాబ్, కృష్ణవేణి చౌరస్తాలో ఉన్న మరో రెండు ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీటితో పాటు మరికొన్ని ప్రైవేట్ దవాఖానల్లో కూడా గుట్టుచప్పుడు కాకుండ పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. పరీక్షల కోసం ఒక్కో వ్యక్తి నుంచి రూ.రెండు వేల నుంచి రూ.4వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
కిట్స్ ఎక్కడివి..?
ప్రభుత్వం కిట్స్ కొనుగోళ్లకుకాని ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్షలు చేసేందుకు కాని అనుమతి ఇవ్వలేదు. కేవలం ప్రభుత్వం ల్యాబ్‌లలో, ప్రభుత్వ అనుమతి ఉన్న ల్యాబ్‌లలో మాత్రమే పరీక్షలు నిర్వహించాలి. అయితే ప్రైవేట్ దవాఖానలకు, ల్యాబ్‌లకు కిట్స్ ఎలా చేరాయన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అయితే వైద్య ఆరోగ్య శాఖలోని కొందరి అధికారుల సహకారం ల్యాబ్ నిర్వాహకులకు ఉన్నట్లుగా సమాచారం. ఇందుకు వారికి కూడా వాటా ముట్టచెబుతున్నట్టుగా ప్రచారం సాగుతున్నది.
పాజిటివ్ వచ్చినా బయటే..
ప్రైవేట్ ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహిస్తుండడంతో లక్షణాలు ఉన్నవారు అధిక సంఖ్యలోనే పరీక్షలు చేయించుకున్నట్లుగా ప్రచారం సాగుతుంది. కొందరు గుట్టు చప్పుడు కాకుండా చికిత్స తీసుకుంటున్నారు. మరికొందరు కనీస నియమాలు పాటించకుండా తమకి ఎలాంటి జబ్బులు లేవని అందరినీ నమ్మిస్తూ ప్రజల్లో తిరుగుతున్నట్లు సమాచారం. దీంతో వైరస్ వ్యాప్తి మరింత ఉధృతంగా ప్రజల్లోకి వెలుతుందన్న భయం అందరిలో నెలకొన్నది.
ఉన్నతాధికారులు స్పందించాలి
కరోనా వైరస్ పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజలంతా అయోమయ స్థితిలో ఉంటే..ప్రైవేట్ ల్యాబ్‌లు, దవాఖానల దందా మరింత ఆందోళన కల్గిస్తున్నది. ప్రైవేట్‌గా పరీక్షలు చేయించుకున్న వారు బయట తిరుగుతున్నారన్న వార్తలు గుప్పుమంటుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
తాజావార్తలు
- చైనా వ్యాక్సిన్‌ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్