Gadwal
- Jul 26, 2020 , 06:59:12
VIDEOS
మావోల కదలికలపై ఎన్ఐఏ నిఘా

గద్వాల అర్బన్ : మావోల కదలికలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ బృందం శనివారం జిల్లాలో పర్యటించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వరకు జిల్లాలో మావోల సంస్మరణ సభ లు జరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఎన్ఐఏ బృందం ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిసింది. సభలకు వచ్చే వ్యక్తుల వివరాలు సేకరించే పనిలో ఈ బృందం నిమగ్నమైనట్లు సమాచారం. జిల్లా వ్యక్తులకు భాగ స్వామం ఉంటున్నదనే విషయంపై విచారణ జరిపారు. ఇందులో భాగంగానే పలువురి నుంచి వివరాలు సేకరించి వెళ్లినట్లు సమాచారం
తాజావార్తలు
MOST READ
TRENDING