జూరాల ప్రాజెక్టుకు హెచ్చుతగ్గులుగా వరద

- ఇన్‌ఫ్లో 50,000,అవుట్‌ఫ్లో 43,958 క్యూసెక్కులు
- ఆల్మట్టి, నారాయణపూర్‌కు నిలకడగా..
- శ్రీశైలం రిజర్వాయర్‌లో పెరుగుతున్న నీటిమట్టం
- ఎడమ గట్టు కేంద్రంలోవిద్యుదుత్పత్తి ప్రారంభం
ఎగువ నుంచి వరద తరలివస్తుండటంతో జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ గలగలలు సంతరించుకున్నాయి. ఆదివారం సాయంత్రం వరకు ఒక గేటు ద్వారా నీటి విడుదల కొనసాగగా రాత్రికి గేటును మూసివేశారు. ఇన్‌ఫ్లో 50,000 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో43,958 క్యూసెక్కులుగా నమోదైంది. పవర్ హౌజ్‌కు 38,332 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ 5 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. కుడి కాలువ ద్వారా 391 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 900 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్ట్‌కు 1500 క్యూసెక్కులు, భీమా-2కు 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 630 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలకు వరద నిలకడగా ఉండగా.. తుంగభద్ర ప్రాజెక్టుకు పెరుగుతున్నది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. దీంతో ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించారు.
జోగుళాంబ గద్వాల, నమస్తేతెలంగాణ: జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఆదివారం సాయంత్రానికి జూరాలలో ఇన్‌ఫ్లో 52,000, అవుట్‌ఫ్లో 43,958 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్‌లో ఒక గేటు ద్వారా 4,116 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. రాత్రి 9గంటలు గేటు మూసివేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగుల్లో 9.6టీఎంసీలుండగా ప్రస్తుతం 1043.930 అడుగుల్లో 8.989 టీఎంసీలు నిల్వ ఉన్నది. పవర్‌హౌస్‌కు 38,332 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ఐదు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. కుడి కాలువ ద్వారా 391, ఎడమ కాలువ ద్వారా 900, సమాంతర కాలువ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎత్తిపోతల పథకాలకు నీటి పంపింగ్ కొనసాగుతున్నది. నెట్టెంపాడు రిజర్వాయర్‌కు 1500 క్యూసెక్కులు, భీమా-2కి 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 630 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్‌కు వరద కొనసాగుతున్నది. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్ ఫ్లో 47,611క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 46,130 క్యూసెక్కులుగా నమోదైంది. ఆల్మట్టి నీటి మట్టం 1705 అడుగుల్లో 129.72 టీఎంసీలుండగా ప్రస్తుతం 1696.88 అడుగుల్లో 90.40 టీఎంసీలు నిల్వ ఉన్నది. నారాయణపూర్ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 45,421 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 45,785 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగుల్లో 37.64 టీఎంసీలుండగా ప్రస్తుతం 1612.86 అడుగుల్లో 34.64 టీఎంసీలు నిల్వ ఉన్నది.
తుంగభద్రకు పెరుగుతున్న వరద
అయిజ: కర్ణాటకలోని టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో పెరుగుతున్నది. ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండటంతో డ్యాంకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ఆదివారం తుంగభద్ర జలాశయంలోకి 17,138 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. కర్ణాటక, ఏపీ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తాగునీటి అవసరాల నిమిత్తం 289 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. 100.86 టీఎంసీల సామర్థ్యం గల టీబీ డ్యాంలో ప్రస్తుతం 26.972 టీఎంసీలు నిల్వ ఉండగా, 1633 అడుగుల నీటి మట్టానికి గానూ 1605.24 అడుగుల నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు రోజుల్లో తుంగభద్ర డ్యాంకు మరింత వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందనిఅన్నారు.
తాజావార్తలు
- ఏపీలో ఘోర ప్రమాదం : ముగ్గురు మృతి
- అఫీషియల్: ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు
- శివరాత్రి ఉత్సవాలు.. మంత్రి ఐకే రెడ్డికి ఆహ్వానం
- బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్
- 5 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న యష్..!
- కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్