బుధవారం 25 నవంబర్ 2020
Gadwal - Jul 18, 2020 , 01:18:10

వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి

వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి

  • వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

కొత్తగూడెం: సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కరోనా, సీజనల్‌ వ్యాదుల నియంత్రణపై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం వైద్య సేవలకు ఎంతో ప్రాధాన్యతనిస్తుంటే.. కొంతమంది సిబ్బంది నిర్లక్ష ధోరణి వల్ల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై 

నమ్మకం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గురువారం డివిజన్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా ఉప వైద్యాధికారులు నివేదికలు అందజేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను అడిగి తెలుసుకొని పర్యవేక్షణ కొరవడిందని, 25 శాతం లక్ష్య సాధనలో ఉన్న సిబ్బంది నుంచి వివరణ తీసుకొని తనకు నివేదికలు అందజేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. వైద్య సిబ్బంది విధులు నిర్వహించే ప్రాంతాల్లోనే ప్రజలకు అందుబాటులో

ఉండి సేవలందిస్తే చికిత్సకు ప్రజలు వస్తారని అన్నారు.  జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 14 ర్యాపిడ్‌, వ్యక్తి గత పరిరక్షణ కిట్లు పంపిణీ చేశామన్నారు. రక్తనమూనాలు సేకరణ అదనపు సిబ్బంది కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి భాస్కర్‌, ఆస్పత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరరావు, ఉప వైద్యాధికారులు వినోద్‌, చేతన్‌, నరేశ్‌, శ్రీనివాసరావులు పాల్గొన్నారు. 

గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలి :

ఐటీడీఏ పీవో గౌతమ్‌

భద్రాచలం: భద్రాచలం ఏజెన్సీలోని గిరిజన కుటుంబాల ఆర్ధికాభివృద్ధికి ఐటీడీఏ యూనిట్‌ అధికారులు శక్తివంచన లేకుండా పని చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్‌పోట్రు సూచించారు. శుక్రవారం ఐటీడీఏ పీవో ఛాంబర్‌లో ఐటీడీఏ వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. ప్రతి శాఖ ద్వారా కేటాయించిన నిధులతో ఎంత అభివృద్ధి చేస్తున్నారు.. క్షేత్రస్థాయి చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతి నివేదికలను శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై ఐటీడీఏకు వచ్చే దరఖాస్తులను డీడీ, ఆర్‌సీవో, పీఎంఆర్‌సీ ఈ శాఖ తప్ప మిగతా శాఖల డ్రాయింగ్‌ డిస్‌ పర్మింగ్‌ ఆఫీసర్‌కు పంపించాలని పీవో జనరల్‌ను ఆదేశించారు. సమాచార హక్కు చట్టం యొక్క ప్రాముఖ్యత గురించి దరఖాస్తు చేసే

లబ్ధిదారునికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సమాచార హక్కు చట్టంలో ఉన్న నిబంధనలను ఉల్లంఘించి సమాచారం కోరవద్దని అన్నారు. సమాచార హక్కు చట్టంలో దరఖాస్తు చేసుకొనే ప్రతి వ్యక్తి చట్టంలో ఉన్న  నిబంధనలు తెలుసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకొన్న వ్యక్తికి 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలన్నారు. మారుమూల గిరిజన మండలాలైన ఆళ్లపల్లి, గుండాల, పినపాక, ములకలపల్లి, కరకగూడెం కాంక్రీట్‌ మిక్సింగ్‌ యూనిట్స్‌కు సంబంధించినవి ఈజీఎస్‌ కింద ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అలాగే జీసీసీ ద్వారా దాల్‌ యూనిట్‌, న్యూట్రీ బిస్కెట్స్‌ యూనిట్స్‌ ప్రారంభించడానికి సిద్ధం చేయాలని జేడీఎం విభాగం ద్వారా ఉపాధి కల్పన, శానిటరీ న్యాప్‌కిన్‌ యూనిట్ల ద్వారా స్వయం ఉపాధి పొందే గిరిజన మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రోత్సహించాలని జేడీఎంను ఆదేశించారు. డీడీ గిరిజన సంక్షేమ శాఖ ద్వారా క్రీడా సామగ్రి స్క్రూట్నీ కమిటీ ద్వారా చెక్‌ చేసి పాఠశాలలకు వసతి గృహాలకు సరఫరా చేయాలని డీడీని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్‌ నాగోరావు, ఎస్వో సురేశ్‌బాబు, డీడీ జహీరుద్దీన్‌, ఎవో బీఎం, జీసీసీ డీఎం కుంజా వాణి, ఏడీ అగ్రికల్చర్‌ సుజాత, జేడీఎం జాబ్స్‌ హరికృష్ణ, క్రీడల నిర్వహణ అధికారి వీరునాయక్‌, ఉద్యానవన శాఖ అధికారి ప్రకాశ్‌ పాటిల్‌ పాల్గొన్నారు.