జనాభా నియంత్రణ అందరి బాధ్యత

- ఇన్చార్జి డీఎంహెచ్వో భీమానాయక్
గద్వాల టౌన్ : జనాభా నియంత్రణలో అందరూ భాగస్వాములైనప్పుడే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందని ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ భీమానాయక్ అన్నారు. కుటుంబ నియంత్రణలో ఉత్తమ సేవలు అందించిన డాక్టర్లకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను ఆయన అందజేశారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా పెరుగుదల వలన ఆర్థికాభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందన్నారు. జనాభా పెరుగుదల వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాలలో భారతదేశం రెండో స్థానంలో ఉందన్నారు. జనాభా నియంత్రీకరణతో పాటు దాన్ని స్థిరీకరించడం ముఖ్యమన్నారు. జనాభా నియంత్రణకు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శోభారాణి, మాతాశిశు సంరక్షణ కార్యక్రమ అధికారి డాక్టర్ సునీత, ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శశికళ, ప్రోగ్రాం అధికారి డాక్టర్ స్రవంతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, అధికారులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలో అయిజ పీహెచ్సీకి మొదటి స్థానం
అయిజ : 2019-20 ఏడాదికిగానూ జిల్లా లో అత్యధిక కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించడంలో అయిజ పీహెచ్సీ మొదటి స్థానంలో నిలిచింది. 2019-20 ఏడాదిలో 405 కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించినట్లు ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ భీమానాయక్ తెలిపారు. సోమవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో అయిజ పీహెచ్సీ వైద్యులు డాక్టర్ రామలింగారెడ్డిని ప్రశంసించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల ద్వారా చేయించడం పీహెచ్సీ వైద్యుల కృషి ఫలితమన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామలింగారెడ్డికి భీమానాయక్ ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్లు సునీత, శోభరాణి ఉన్నారు.
బెస్ట్ ఏఎన్ఎంగా మేరీ
అయిజ : 2019-20 ఏడాదికి గానూ జిల్లాలో అత్యధిక కుటుంబ నియంత్రణ చికిత్స చేయించిన అయిజ మండ లం, పులికల్ ఏఎన్ఎం మేరీని ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలో ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ భీమానాయక్ ఏఎన్ఎంకు ప్రశంసాపత్రం, రూ. 2వేల నగదును అందజేశారు. 2019-20 ఏడాదిలో పులికల్ సబ్ సెంటర్ నుంచి దాదాపు 50 మంది కి పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో ఏఎన్ఎం మేరీ కీలక పాత్ర పోషించిందని ఇన్చార్జి డీఎంహెచ్వో పేర్కొన్నారు. ప్రతి ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు కు టుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో ముందుండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సునీత, డాక్టర్ శోభారాణి, అయిజ పీహెచ్సీ డాక్టర్ రామలింగారెడ్డి తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ఆయన ఒకప్పుడు స్టార్, ఇప్పుడు కాదు: సౌగతారాయ్
- ఏపీలో కొత్తగా 136 కరోనా కేసులు
- శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా స్వామివారి ధ్వజారోహణ
- అన్ని మున్సిపాలిటీల్లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు
- భారతదేశపు మొదటి అటవీ వైద్య కేంద్రం ప్రారంభం
- పదేండ్లలో చేయాల్సిన పనులు11 నెలల్లో పూర్తి చేశాం
- భారత అమ్మాయిల ఓటమి
- రైతులారా ఆశ కోల్పోవద్దు.. వంద నెలలైనా మీతో ఉంటాం: ప్రియాంక గాంధీ
- నిర్మాణ అద్భుతం దేవుని గుట్ట ఆలయం
- ఈ టీ తాగితే బరువు తగ్గొచ్చు