ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Gadwal - Jul 14, 2020 , 06:45:39

నారాయణపూర్‌ ఏడు గేట్లు ఎత్తివేత

నారాయణపూర్‌ ఏడు గేట్లు ఎత్తివేత

  • ఇన్‌ఫ్లో 40 వేలు,  అవుట్‌ఫ్లో 45 వేల క్యూసెక్కులు
  •  నేటి సాయంత్రం జూరాలకు చేరనున్న వరద
  • ఇన్‌ఫ్లో 6,032, అవుట్‌ఫ్లో 1,784 క్యూసెక్కులు
 గద్వాల/ధరూరు : నారాయణపూర్‌ ప్రాజెక్టులో సోమవారం ఏడు గేట్లు ఎత్తి 45 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండగా, మంగళవారం రాత్రి వరకు జూరాలకు వరద చేరుకునే అవకాశం ఉందని పీజేపీ అధికారులు చెబుతున్నారు. నారాయణపుర నీటి నిల్వ 37.64 టీఎంసీలకుగానూ 34.87 టీఎంసీలు ఉన్నది. ఇన్‌ఫ్లో 40 వేలు, అవుట్‌ఫ్లో 45 వేల క్యూసెక్కులుగా నమోదైంది. జూరాలకు వరద చేరగానే దిగువకు నీటిని విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మొదటగా విద్యుత్‌ ఉ త్పత్తి చేపట్టేందుకు టర్బైన్లకు నీటిని విడుదల చేసి, ఆ తరువాత గేట్ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు వదలనున్నారు. జూరాలలో పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకుగానూ సోమవారం సాయంత్రం 8.377 టీఎంసీల నిల్వ ఉన్నది. ఇన్‌ఫ్లో 6,032, అ వుట్‌ఫ్లో 1,784 క్యూసెక్కులుగా నమోదైంది. నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750, భీమా లిఫ్ట్‌కు 650, కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌కు 151, కుడి, ఎడుమ కాలువలకు 120 క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి డ్యాం నీటి నిల్వ 129.72 టీఎంసీలకుగానూ 96.51 టీఎంసీలు ఉన్నది. ఇన్‌ఫ్లో 56,905, అవుట్‌ఫ్లో 46,130 క్యూసెక్కులుగా నమోదైంది. 
టీబీ డ్యాంకు కొనసాగుతున్న వరద  
అయిజ : కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగ నదికి వరద వస్తుండడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సోమవారం తుంగభద్ర జలాశయంలోకి 17,550 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుండగా, 305 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. 100.86 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 21.798 టీఎంసీల నిల్వ ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. 
శ్రీశైలానికి 1309 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి 1,309 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, నిల్వ 215.807 టీఎంసీలు కాగా, సోమవారం సాయంత్రానికి నీటిమట్టం 815 అడుగులు, నిల్వ 37.3540 టీఎంసీలుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కుడిగట్టు, ఎడమగట్టులలో విద్యుదుత్పత్తి చేయడం లేదు. రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌ నుంచి నీరు విడుదల కావడం లేదు.

VIDEOS

logo